rajamouli, karan johar, rajkumar hirani, indian directors
Richest Indian Directors: దర్శకుల్లో ప్రస్తుతం రాజమౌళిని టాప్ డైరెక్టర్ గా భావిస్తుంటారు. ఆయన మూడు సినిమాలతోనే 3500కోట్ల బిజినెస్ చేయించారు. ఇండియాలోనే ఈ రేంజ్ బిజినెస్ చేసిన దర్శకుడు మరొకరు లేరు. తన కెరీర్‌లో సుమారు నాలుగువేల కోట్ల వ్యాపారం రాజమౌళి పేరుతో జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆస్తుల విషయంలో ఆయన వెనకబడిపోయారు. మరి ఇండియాలోనే రిచ్చెస్ట్ డైరెక్టర్ ఎవరు? రాజమౌళి కి ఎంత ఆస్తులున్నాయో తెలుసుకుందాం.
Karan Johar
ఇండియాలో రిచ్చెస్ట్ డైరెక్టర్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కావడం విశేషం. ఆయన దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. దర్శకుడిగా `కుచ్ కుచ్ హోతా హై`, `కభీ ఖుషీ కభీ ఘమ్`, `కభీ అల్విదా నా కేన్హా`, `మై నేమ్ ఈజ్ ఖాన్`, `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`, `ఏ దిల్ హై ముష్కిల్`, `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` చిత్రాలను రూపొందించారు. కానీ ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా నిలిచారు. ఆయన ఆస్తులు విలువ 1700కోట్లు ఉంటాయని అంచన.
Rajkumar Hirani
ఇక రెండో స్థానంలో మరో బాలీవుడ్ సంచలనం రాజ్ కుమార్ హిరానీ ఉన్నారు. ఆయన ఆస్తులు రూ.1300కోట్లు కావడం విశేషం. సెటైరికల్‌గా, సందేశాత్మక చిత్రాలను రూపొందించడంలో ఆయన దిట్ట. రాజ్ కుమార్ హిరానీ 20ఏళ్లలో ఆరు సినిమాలే చేశాడు. ఆరూ సంచలనాలే. `మున్నా భాయ్ ఎంబీబీఎస్`, `లగే రహో మున్నా భాయ్`, `3 ఇడియట్స్`, `పీకే`, `సంజు`, `దంకీ` చిత్రాలున్నాయి. అన్నీ బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టించాయి.
sanjay leela bhansali
మూడో స్థానంలో సంజాయ్ లీలా భన్సాలీ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 940కోట్లు అని అంచనా. బాలీవుడ్ లో మ్యూజికల్ హిట్స్, విజువల్ వండర్స్, హిస్టారికల్ ఫాంటసీ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయన `ఖామోషి`, `హమ్ దిల్ దే చుకే సనమ్, `దేవ్ దాస్`, `బ్లాక్`, `సావరియా`, `గుజారిష్`, `రామ్ లీలా`, `బాజీరావ్ మస్తానీ`, `పద్మావత్`, `గంగూభాయి కథియవాడి` వంటి వండర్స్ క్రియేట్ చేశారు.
anurag kashyap
నాల్గో స్థానంలో అనురాగ్ కశ్యప్ నిలిచారు. ఆయన ఆస్తులు రూ.850కోట్లు ఉంటాయట. ఆయన బాలీవుడ్‌లో డార్క్ క్రైమ్ కామెడీ, థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్నారు. సమాజంపై తనకున్న అవగాహనని ఇందులో వెల్లడించారు. `పాంచ్`, `బ్లాక్ ఫ్రైడే`, `నో స్మోకింగ్`, `ముంబాయి కట్టింగ్`, `దేవ్ డీ`, `గులాల్`, `గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్` సిరీస్, `బాంబే టాకీస్`, `బాంబే వాల్వెట్``, `అగ్లీ` వంటి చిత్రాలను రూపొందించారు.
meghna gulzar
సుమారు రూ.830 కోట్లతో బాలీవుడ్ లేడీ డైరెక్టర్ మేఘనా గుల్జార్ ఐదో స్థానంలో నిలిచారు. ఆమె `ఫిలాల్`, `జస్ట్ మ్యారీడ్`, `దస్ కహానియాన్`, `తల్వార్`, `రాజీ`, `ఛపాక్`, `సామ్ మహదూర్` చిత్రాలను రూపొందించారు.