అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?

Published : Dec 19, 2025, 06:24 PM IST

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'అఖండ 2'. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ఇది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై..

PREV
15
అఖండ మేనియా..

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'అఖండ 2'. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ఇది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఇక తమన్ ఈ చిత్రానికి బాణీలు అందించాడు. ఈ సినిమా హిట్ కాగా.. చిత్రం ఆఖరిలో 'అఖండ 3' రానున్నట్టు మేకర్స్ హింట్ ఇచ్చారు.

25
ముఖ్య పాత్రలో బాలీవుడ్ నటి..

ఈ సినిమాలో బాలయ్య తర్వాత అంతటి ముఖ్య పాత్రలో.. ఆయన కుమార్తె జనని పాత్ర అని చెప్పొచ్చు. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అలాంటి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది హర్షాలీ మల్హోత్రా. అందం, అభినయంతో పాత్రలో లీనమై మరీ నటించింది ఈ భామ.

35
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ..

బాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ సినిమాలో మున్నీ పాత్రతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఆపై సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ 'అఖండ-2' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 

45
హర్షాలి స్థానంలో ఆ స్టార్ హీరోయిన్..

నిజానికి ఈ పాత్రలో మొదట టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేనిని అనుకున్నారట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. అలాగే హీరో సూర్య కూతురు కోసం కూడా ట్రై చేశారట బోయపాటి.. అయితే అది కూడా సెట్ కాకపోవడంతో చివరికి హర్షాలీకి ఈ అవకాశం దక్కిందని టాక్.

55
సితార ఘట్టమనేని నటించి ఉంటే..

ఈ చిత్రంలో హర్షాలి బదులు బాలయ్య కూతురు పాత్రలో సితార నటించి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం అఖండ-2 సినిమా హిట్‌తో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ చేస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ వెళ్ళింది అఖండ చిత్ర యూనిట్.

Read more Photos on
click me!

Recommended Stories