Harikrishna: ఆ శక్తి ఉంటే తప్పకుండా నందమూరి హరికృష్ణని బతికిస్తా.. ఎలాగో చెబుతూ కీరవాణి ఎమోషనల్ కామెంట్స్

Published : Dec 19, 2025, 06:01 PM IST

నందమూరి హరికృష్ణపై లెజెండ్రీ సంగీత దర్శకుడు కీరవాణి తన అభిమానం చాటుకున్నారు. ఒక్క అవకాశం ఉంటే తాను హరికృష్ణని ఎలా బతికిస్తానో అనేది కీరవాణి వివరించారు. 

PREV
15
నందమూరి హరికృష్ణ 

నందమూరి హరికృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. ఎన్టీఆర్ వారసుడిగా నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన హరికృష్ణ సీతయ్య, లాహిరి లాహిరి లాహిరో లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన వారసులు కళ్యాణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా అదరగొడుతున్నారు. అయితే 2018లో నందమూరి హరికృష్ణ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 

25
రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ 

2018 ఆగష్టు 29న హరికృష్ణ కావలిలో ఓ వివాహ వేడుకకి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపు తప్పి జాతీయ రహదారి డివైడర్ ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ హరికృష్ణ మరణించారు. ఇది ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సన్నిహితులకు జీర్ణించుకోలేని విషాదంగా మారింది. 

35
ఆ శక్తి ఉంటే హరికృష్ణని బతికిస్తా 

హరికృష్ణతో లెజెండ్రీ సంగీత దర్శకుడు కీరవాణికి కూడా మంచి అనుబంధం ఉంది. సీతయ్య లాంటి సూపర్ హిట్ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఓ ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ.. తనకి టైం ట్రావెల్ చేసే శక్తి ఉంటే ముందుగా చేసే పని హరికృష్ణ గారిని ప్రమాదం నుంచి కాపాడడమే అని అన్నారు. 

45
హరికృష్ణని గెస్ట్ హౌస్ కి రమ్మని చెబుతా 

నాకు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే 2018 ఆగష్టు 28 వెళతాను. హరికృష్ణ గారికి ఫోన్ చేసి వెంటనే నా గెస్ట్ హౌస్ కి రమ్మని చెబుతాను. రెండు ట్యూన్స్ ఉన్నాయి. వాటి గురించి చర్చించాలి. సినిమా ఎప్పుడైనా మొదలు కానివ్వండి. ముందు మనం ట్యూన్స్ కంప్లీట్ చేద్దాం అని ఆయనకి చెబుతా. ఎందుకంటే నా ట్యూన్స్ అంటే హరికృష్ణ గారికి చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా వస్తారు. 

55
ప్రయాణం చేయనివ్వను 

2 రోజుల పాటు నా గెస్ట్ హౌస్ లోనే ఆయన్ని ఉంచేస్తా. దీనితో మరుసటి రోజు ఆయన ప్రయాణం చేయరు. ఆ విధంగా ఆయన్ని ప్రమాదం నుంచి కాపాడతా అని కీరవాణి అన్నారు. కీరవాణి మాటలని బట్టి ఆయనకి హరికృష్ణ అంటే ఎంత అభిమానమో అర్థం అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories