Samantha: రాజ్ తో పెళ్లితో పాటు ఈ ఏడాది సమంత జీవితాన్ని మార్చేసిన మరో సంఘటన.. ఇయర్ ఎండ్ లో బయటపెట్టిందిగా

Published : Dec 26, 2025, 10:59 AM IST

Samantha: తన జీవితాన్ని మార్చేసిన 2 సంఘటనల గురించి సమంత తెలిపింది. ఈ ఏడాది మధుర జ్ఞాపకాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
రాజ్ తో సమంత పెళ్లి 

ఇటీవల సమంత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న సామ్ డిసెంబర్ 1న అతడిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొని కోలుకుంది. ఇప్పుడు కొత్తగా జీవితాన్ని రాజ్ తో ప్రారంభించింది. 

25
సమంత జీవితాన్ని మార్చేసిన సంఘటనలు 

తాజాగా సమంత ఈ ఏడాది తన లైఫ్ లో జరిగిన మధుర జ్ఞాపకాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిలో రెండు సంఘటనలు తన జీవితాన్ని మార్చేశాయి అని సమంత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మొదటిది రాజ్ నిడిమోరుతో వివాహం కాగా మరొకటి.. సొంత నిర్మాణ సంస్థని ప్రారంహించి శుభం చిత్రంతో హిట్ అందుకోవడం అని సమంత రివీల్ చేసింది. 

35
సమంత పోస్ట్ వైరల్ 

తన పోస్ట్ లో సమంత పెళ్ళికి సంబంధించిన అన్ సీన్ ఫోటోలు, శుభం చిత్రానికి సంబంధించిన ఫోటోలని షేర్ చేసింది. రాజ్ తో కలసి సమంత అనేక కార్యక్రమాల్లో పాల్గొంది. ఆ ఫోటోలని కూడా అభిమానులతో పంచుకుంది. 

45
రాజ్ తో పరిచయం 

సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ లో రాజ్ దర్శకత్వంలో నటించింది. అప్పుడే ఆమెకి రాజ్ తో పరిచయం ఏర్పడింది. అయితే నటిగా మాత్రం సమంత ఈ ఏడాది ప్రభావం చూపలేదు. 

55
హీరోయిన్ గా నటించేది ఎప్పుడు ?

చివరగా సమంత హీరోయిన్ గా నటించింది 2023లో విడుదలైన ఖుషి చిత్రంలోనే. శుభం మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. గతంలో సమంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని ప్రకటించింది. కానీ ఇంతవరకు ఆ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories