ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలిసి నటించిన తొలి సినిమా ఏంటో తెలుసా? రామారావు చేసిన పనికి అక్కినేని షాక్‌

Published : Aug 25, 2025, 07:36 PM IST

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలిసి చాలా సినిమాలు చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. మరి ఈ ఇద్దరు కలిసి నటించిన మొదటి మూవీ ఏంటో తెలుసా? 

PREV
15
లెజెండ్స్ గా రాణించిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ టాలీవుడ్‌లో దిగ్గజ నటులు. ఇంకా చెప్పాలంటే ఈ ఇద్దరిని ఇండస్ట్రీకి రెండు కళ్లుగా అభివర్ణిస్తుంటారు. నటనలో ఎవరికి వారు ప్రత్యేకతని చాటుకున్నారు. ఎవరికి సూట్‌ అయ్యే సినిమాలు వారు చేసి మెప్పించారు. తిరుగులేని స్టార్స్ గా ఎదిగారు. ఇద్దరూ పోటీ పడ్డారు. అదే సమయంలో కలిసి సినిమాలు చేశారు. ఏదేమైనా ఇద్దరూ కలిసి లెజెండ్స్ గా ఎదిగారు. తర్వాత తరాలకు ఆదర్శంగా నిలిచారు.

DID YOU KNOW ?
స్టూడెంట్‌గా ఏఎన్నార్‌
అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి చిత్రం `ధర్మపత్ని`. ఇందులో విద్యార్థిగా కనిపించారు ఏఎన్నార్‌.
25
`ధర్మపత్ని`తో ఏఎన్నార్‌, `మనదేశం`తో ఎన్టీఆర్‌ పరిచయం

ఇదిలా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు మొదట సినిమాల్లోకి వచ్చారు. 1941లోనే ఆయన `ధర్మపత్ని` చిత్రంలో చిన్న రోల్‌ చేశారు. ఆ తర్వాత మూడేళ్లకి `శ్రీ సీతారామ జననం` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఇందులో రాముడిగా ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత లీడ్‌గా చాలా సినిమాలు చేశారు. రెండు మూడేళ్లలోనే మంచి హీరోగా ఎదిగారు ఏఎన్నార్‌. అక్కినేని సినిమాల్లోకి వచ్చిన ఎనిమిదేళ్లకి 1949లో నందమూరి తారక రామారావు వచ్చారు. ఆయన `మనదేశం` చిత్రంతో నటుడిగా అడుగుపెట్టారు.

35
ఎన్టీఆర్‌, ఎన్నార్‌ కలిసి నటించిన తొలి చిత్రం `పల్లెటూరి పిల్ల`

ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి అనేక సినిమాలు చేశారు. వీరి కాంబినేషన్‌లో అనేక క్లాసికల్స్ వచ్చాయి. ఇండస్ట్రీ హిట్లు వచ్చాయి. మరి ఈ ఇద్దరు కలిసి నటించిన మొదటి సినిమా ఏంటనేది చూస్తే, ఆ మూవీనే `పిల్లెటూరి పిల్ల`. 1950లో విడుదలైన ఈ చిత్రానికి బి ఏ సుబ్బరావు దర్శకత్వం వహించారు. ఆయనతోపాటు మీర్జాపురం రాజా సాహెబ్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో అంజలి ముఖ్య పాత్ర పోషించారు. ఇదొక విలేజ్‌ యాక్షన్‌ డ్రామా. ఇందులో ఏఎన్నార్‌ రైతు కూలీగా, ఎన్టీఆర్‌ జమీందార్‌ వద్ద పనిచేసే బంట్రోతుగా నటించారు. అంజలి ఊరులో ధైర్యవంతురాలైన అమ్మాయిగా కనిపిస్తుంది. దొర ఆగడాలకు వ్యతిరేకంగా ఊరంతా తిరుగుబాటు చేయడమే ఈ మూవీ కథ. దానికి ఒక చెంపదెబ్బ కారణం కావడం విశేషం.

45
ఏఎన్నార్‌ని తర్వాత ఎంపిక చేశారు..

అయితే ఈ మూవీలో ఎన్టీఆర్‌ని మెయిన్‌ రోల్‌గా ఎంచుకున్నారు. ఇందులో మొదట ఏఎన్నార్‌ లేరు. ఆయన పాత్ర కోసం కళ్యాణం రాఘురామయ్యని ఎంపిక చేశారు. కానీ అనూహ్యంగా ఆయన్ని తొలగించి ఏఎన్నార్‌ని తీసుకున్నారు. అలా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ ఇందులో కలిసి నటించారు. అప్పట్లో బ్రిటీష్‌ తర్వాత నైజాం నవాబ్‌ ఆగడాలు ఎక్కువగా ఉండేవి. ఆ కథని అద్దం పట్టేలా సినిమా సాగడంతో జనం బ్రహ్మరథం పట్టారు. 1950 ఏప్రిల్‌ 27న విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. వంద రోజులు ప్రదర్శించబడింది.

55
రామారావు చేతికి ఫ్రాక్చర్‌, ఏఎన్నార్‌ షాక్‌

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కిది మూడో సినిమా. `మనదేశం`తో ఆయన నటుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత `షావుకారు`లో నటించారు. `పల్లెటూరి పిల్ల` మూడో మూవీ. ఇందులో యాక్షన్‌ సీన్లలో రామారావు సొంతం చేశారు. ముఖ్యంగా ఎద్దుతో పోరాడే సీన్లని డూప్‌ లేకుండా తానే చేశాడు. దర్శక, నిర్మాతలు వద్దు అని వారించినా వినకుండా సొంతంగా చేశాడు. దీంతో రామారావు కుడిచేతికి రెండు చోట్ల గాయాలయ్యాయి. అయినా దాన్ని లెక్కచేయకుండా కట్లువేసుకుని షూటింగ్‌ పూర్తి చేశారు రామారావు. ఇది చూసి ఏఎన్నార్‌ షాక్‌ అవ్వడం విశేషం. ఇది ఆయన కమిట్‌మెంట్‌, డెడికేషన్‌కి నిదర్శనంగా నిలుస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories