Published : Oct 14, 2025, 03:41 PM ISTUpdated : Oct 14, 2025, 10:31 PM IST
సినిమాలు వదిలేసి, పాలిటిక్స్ లో తిరుగుతున్న హరికృష్ణను 43 ఏళ్ల వయసులో హీరోగా మార్చిన దర్శకుడు ఎవరో తెలుసా? హరికృష్ణ వద్దన్నా వినకుండా పవర్ ఫుల్ పాత్ర చేయించింది ఎవరు?
సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పెద్దగా సినిమాలు చేసింది లేదు. తండ్రి వారసత్వం తీసుకుని కంప్లీట్ గా ఇండస్ట్రీకి పరిమితం అయింది బాలయ్య ఒక్కరే. హరికృష్ణ మాత్రం గతంలో తన తండ్రితో కలిసి తాతమ్మ కల, దానవీర శూర కర్ణ, రామ్ రహీం లాంటి కొన్నిసినిమాల్లో కనిపించినా.. ఆతరువాత సినిమాలకు దూరం అయ్యారు. హరికృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజకీయ ప్రయాణం చేశారు. ఆయన క్యాబినేట్ లో మంత్రిగా కూడా పనిచేశాడు. పెద్ద ఎన్టీఆర్ మరణం తరువాత మూడేళ్లకు మళ్ళీ సినిమాల వైపు అడుగేశారు హరికృష్ణ. అది కూడా ఓ డైరెక్టర్ కారణంగా.
25
హరికృష్ణ కోసం డైరెక్టర్ పడిగాపులు
1999 లో డైరెక్టర్ N.శంకర్ పరిటాల రవి నిర్మాతగా శ్రీరాములయ్య సినిమాను తెరకెక్కించారు. ఈసినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది శ్రీరాములయ్య. ఈసినిమాలో హరికృష్ణ నక్సలైట్ పాత్రలో కనిపించారు. జైలుకు వెళ్లిన మోహన్ బాబును మోటివేట్ చేసే పాత్రలో హరికృష్ణ కనిపించారు. అయితే ఈ క్యారెక్టర్ కోసం హరికృష్ణు తీసుకోడానికి డైరెక్టర్ ఎన్. శంకర్ చాలా కష్టపడాల్సి వచ్చిందట. హరికృష్ణను ఒప్పించడానికి చాలా టైమ్ పట్టిందని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వెల్లడించారు.
35
రజినీకాంత్ ను తీసుకోవాలని
శ్రీరాములయ్యలో హరికృష్ణ చేసిన పాత్రను ముందుగా రజినీకాంత్ తో చేయించాలని చూశారట. చెన్నై వెళ్లి కథ కూడా వినిపించారు దర్శకుడు. సూపర్ స్టార్ కు కథ బాగా నచ్చింది. కానీ అప్పటికే మోహన్ బాబుతో పెదరాయుడు సినిమా చేశారు, మళ్లీ మోహన్ బాబుతోనే కాంబినేషన్ సినిమా చేయడం కరెక్ట్ కాదేమో అని తలైవాకు అనిపించింది, అంతే కాదు కాంబినేషన్ సినిమాలు చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు అని అన్నారట రజినీకాంత్. దాంతో ఈ పాత్రకు ఎవరు బాగుంటారు అని ఎన్. శంకర్, పరిటాల రవి ఆలోచించారట. అప్పుడే వారికి హరికృష్ణ గుర్తుకు వచ్చారు.
రజినీకాంత్ కాదనడంతో.. ఈ పాత్రకు హరికృష్ణ అయితే బాగా ఉంటుంది అని శంకర్ కు నమ్మకం కుదిరింది. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. అప్పటికే సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది, ప్రాక్టీస్ పోయింది, ఫిట్ నెస్ పోయింది అని అన్నారు హరికృష్ణ. కానీ శంకర్ మాత్రం పట్టిన పట్టు వదలకుండా రెండు మూడు సార్లు వెళ్లి హరికృష్ణను కలిశారు. మీరయితేనే ఈ సినిమాకు బాగుంటుంది. మరెవరు ఈ క్యారెక్టర్ చేయలేరు అని గట్టిగా చెప్పాడు శంకర్. దాంతో హరికృష్ణ సందేహంగానే ఒప్పుకున్నారట.
55
43 ఏళ్ళకు హీరోగా హరికృష్ణ రీ ఎంట్రీ
శ్రీరాములయ్య సినిమా కోసం ముందుగా ఎవరికీ తెలియకుండా ఫోటో షూట్ చేయించారు హరికృష్ణ. ఈ మూవీలో స్పెషల్ లుక్ కోసం వెయిట్ తగ్గారు, డైట్ మెయింటే చేశారు. అన్ని అలవాట్లు మానేశారు, ఇలా మళ్లీ వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు హరికృష్ణ. ఈ సినిమాలో కొన్ని సీన్లు డూప్ లేకుండా చేశారని దర్శకుడు శంకర్ వెల్లడించారు. ఇక ఈసినిమా తరువాత హరికృష్ణకు హీరోగా వరుసగా అవకాశాలు వచ్చాయి. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య , ఇలా వరుస సినిమాలతో హరికృష్ణ హీరోగా మారిపోయాడు. కొన్ని సినిమాల తరువాత ఆయన సినిమాలు చేయడం మానేశారు.