Soundarya కి ఉన్న అరుదైన హ్యాబీ ఏంటో తెలుసా? ఖాళీ టైమ్‌లో ఆమె చేసి పని ఇదే

Published : Jan 22, 2026, 10:02 AM IST

సౌందర్య డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యింది. తాను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదట. కానీ సౌందర్యకి ఒక అరుదైన హ్యాబీ ఉంది. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తానే వెల్లడించింది. 

PREV
15
గ్లామర్ కి కొత్త అర్థం చెప్పిన సౌందర్య

సౌందర్య ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ శాసించిన నటి. అందం, అభినయంతో ఆమె మెప్పించింది. తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అలరించింది. ఆమెది కర్నాటక అయినా తెలుగు నటిగా ఇక్కడ నిలిచిపోయింది. తెలుగు ఆడియెన్స్ కూడా ఆమెని సొంతం చేసుకున్నారు.  తెలుగు వారివల్లే తాను ఈ స్థాయికి వచ్చానని తాను కూడా పలు మార్లు చెప్పింది. గ్లామర్‌కి తావు లేకుండా చీరలోనే కనిపిస్తూ ఆకట్టుకుంది సౌందర్య. గ్లామర్‌కి కొత్త అర్థాన్నిచ్చింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

25
సౌందర్యలో ఉన్న అరుదైన హ్యాబీ

సౌందర్య చనిపోయి 22 ఏళ్లు అవుతుంది. ఆమె 2004లో హెలీకాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తూ చనిపోయింది. ఆమె మరణించిన తన సినిమాలతో ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. అందరి ప్రశంసలందుకుంటుంది. ఈ క్రమంలో సౌందర్యకి సంబంధించిన ఒక అరుదైన విషయం బయటకు వచ్చింది. ఆమెకి ఉన్న హ్యాబీ ఏంటో తెలిసింది. ఖాళీ దొరికితే ఆమె చేసే పని ఇదేనట. అదేంటంటే?

35
సౌందర్యకి పెయింటింగ్‌ అంటే ఇష్టం

సౌందర్య డాక్టర్‌ కావాలనుకుంది. అనుకోకుండా యాక్టర్‌ అయ్యింది. అది పక్కన పెడితే ఆమెకి ఒక హ్యాబీ ఉంది. పెయింటింగ్‌ వేయడం చాలా ఇష్టం. అందులోనూ విభిన్నమైన పెయింటింగ్‌ వేయడమంటే చాలా ఇష్టమట. ఖాళీ సమయం దొరికితే కచ్చితంగా పెయింటింగ్‌ వేస్తుందట. తాను ఎక్కడ ఉన్నా కూడా ఇంట్లో పెయింటింగ్‌ బోర్డ్ ఉండాల్సిందేనట. బెంగుళూరులోని తన ఇంట్లో పెయింటింగ్‌ కోసం ఒక రూమే ఉందట. స్వతహాగా చిన్నప్పట్నుంచి తనకు పెయింటింగ్‌ అంటే ఇష్టమని, కలర్స్ చూస్తేనే పెయింటింగ్‌ వేయాలనే ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పింది సౌందర్య.

45
పెయింటింగ్‌లో కొత్త రకాలు నేర్చుకోవాలనుకున్న సౌందర్య

అందులో మెలకువలను తన వదిన నుంచి నేర్చుకుందట. అంతేకాదు డ్రాయింగ్‌ క్లాస్‌లకు కూడా వెళ్లిందట. హీరోయిన్‌ అయిన తర్వాత కూడా ఖాళీ టైమ్‌ దొరికితే పెయింటింగ్ వేసేదట.  ఇంకా పెయింటింగ్‌లో కొత్త రకాలు, కొత్త స్టయిల్స్ నేర్చుకోవాలని ఉందట. కానీఆ కోరిక అలానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని సౌందర్య మా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ అరుదైన ఇంటర్వ్యూ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

55
అనుకోకుండా నటిగా మారిన సౌందర్య

సౌందర్య పదవ తరగతి అయిపోగానే సినిమాల్లోకి వచ్చింది. 1992లో ఆమె అనుకోకుండా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. తనకు ఇష్టం లేకపోయినా సినిమా చేయాల్సి వచ్చింది. అలా `రాజాది రాజా` అనే చిత్రంతో కన్నడలో వెండితెరకు పరిచయం అయ్యింది. అక్కడ మూడు నాలుగు సినిమాలు చేయడంతోనే తెలుగులో ఆఫర్లు వచ్చాయి. ఆమె మొదట కమిట్‌ అయిన తెలుగు మూవీ `రైతు భారతం`, కానీ మొదట రిలీజ్‌ అయ్యింది మాత్రం `మనవరాలి పెళ్లి`. తెలుగులో ఆమెకి ఇష్టమైన మూవీ `అమ్మోరు`. ఇక తెలుగులో ఆమె అప్పుడున్న అందరు సూపర్‌ స్టార్లతో నటించింది.  తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. చివరగా ఆమె మోహన్‌ బాబు  హీరోగా వచ్చిన `శివశంకర్‌`లో నటించింది. ఈ మూవీ షూటింగ్‌ సమయంలోనే ప్రమాదం జరిగింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories