`ఆదిత్య 369`లో ఛాన్స్ మిస్‌ చేసుకున్న బాలయ్య ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Published : Apr 02, 2025, 05:02 PM ISTUpdated : Apr 02, 2025, 06:47 PM IST

Aditya 369-Vijayashanti: బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన `ఆదిత్య 369` మూవీలో హీరోయిన్ల కోసం పెద్ద వేటనే సాగిందట. అందులో విజయశాంతిని కూడా అనుకున్నారట. ఆ కథేంటో చూద్దాం.   

PREV
15
`ఆదిత్య 369`లో ఛాన్స్ మిస్‌ చేసుకున్న బాలయ్య ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
aditya 369, vijayashanti

Aditya 369-Vijayashanti: బాలకృష్ణ హీరోగా నటించిన ఎవర్‌ గ్రీన్‌ క్లాసిక్‌ మూవీ `ఆదిత్య 369`. 34ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. సింగీతం శ్రీనివాసరావు విజన్‌కి, శివలెంక కృష్ణ ప్రసాద్‌ ప్యాషన్‌కి,

బాలయ్య నమ్మకానికి, ఎస్పీ బాలసుబ్రమణ్యం డ్రీమ్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్‌గా నటించాల్సింది. మరి ఆమె ఎలా మిస్‌ అయ్యిందంటే? 

25
Aditya 369

Aditya 369`ఆదిత్య 369` మూవీ మళ్లీ ఇప్పుడు రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 4న దీన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అప్పటి క్లాసిక్‌ ని ఈ జనరేషన్‌ ఆడియెన్స్ కి కూడా అందించబోతుంది చిత్ర బృందం.

దీనికి సంబంధించి ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించారు. ఇందులో బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. మూవీ విశేషాలను పంచుకున్నారు. ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది అని, భవిష్యత్‌ తరాలకు కూడా నచ్చేలా ఉంటుందన్నారు బాలయ్య. 

35

`ఆదిత్య 369`లో బాలయ్య సరసన హీరోయిన్‌గా మోహిని నటించింది. కానీ ఆమె కంటే ముందు ముగ్గురు హీరోయిన్ల చుట్టూ ఈ కథ తిరిగింది. మొదట బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్మిళ వద్దకు వెళ్లింది. ఆమెకి డేట్స్ అడ్జెస్ట్ కాలేదు.

దీంతో ఆ తర్వాత దివ్య భారతి వద్దకు వెళ్లింది. ఆమెకి కూడా డేట్స్ సమస్య వచ్చింది. మొదట ఓకే అనుకున్నారు. కానీ సినిమా ప్రారంభించే టైమ్‌కి డేట్స్ సమస్య రావడంతో ఆమె కూడా మిస్‌ అయ్యింది. 
 

45

ఆ తర్వాత ఈ విషయం తెలిసి విజయశాంతి ఇంట్రెస్ట్‌ చూపించింది. దీంతో బాలయ్య, విజయశాంతి జోడీ భలే ఉంటుందనుకున్నారు నిర్మాత కృష్ణప్రసాద్‌. ఓకే చేద్దామనుకున్నారు. అయితే అప్పటికే బాలయ్యతో ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. `భలే దొంగ`, `ముద్దుల మామయ్య` సినిమాలు చేశారు.

`లారీ డ్రైవర్‌` అప్పుడే షూటింగ్‌ జరుగుతుంది. తర్వాత కూడా రెండు మూడు సినిమాలకు బాలయ్య సరసన విజయశాంతినే ఫిక్స్ చేశారు. దీంతో కంటిన్యూగా బాలయ్యతో విజయశాంతినే ఉంటుంది, అది రొటీన్‌ అయిపోతుంది, ఫ్రెష్‌నెస్‌ ఉండదని చెప్పి చివరి నిమిషంలో డ్రాప్‌ అయ్యారట. 
 

55
Nandamuri Balakrishna Aditya 369 film to 4k re release

ఆ తర్వాత మోహినిని తీసుకున్నట్టు చెప్పారు నిర్మాత కృష్ణప్రసాద్‌. ఆమె అప్పుడే తమిళంలో ఓ సినిమా చేస్తుంది. కెమెరామెన్‌ పీసీ శ్రీరామ్‌ సజెస్ట్ చేయడంతో ఆమెని లుక్‌ టెస్ట్ చేశారు. దర్శకుడికి ఓకే, నిర్మాతకి ఓకే అయ్యింది.

బాలయ్యని అడిగితే మీకు ఎవరు నచ్చినా నాకు ఓకే అని చెప్పారట. అలా `ఆదిత్య 369`లోకి హీరోయిన్‌గా మోహిని వచ్చిందన్నారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌. హీరోయిన్ల కోసం పెద్ద వేట సాగిందన్నారు. 

read  more: బాలకృష్ణ కోసం విలన్‌గా మారుతున్న బాలీవుడ్‌ హీరోయిన్‌.. అప్పుడు భార్యగా, ఇప్పుడేమో ?

also read: సౌందర్యకి `అమ్మోరు` సినిమా ఛాన్స్ రావడానికి కారణమైన స్టార్‌ కమెడియన్‌ ఎవరో తెలుసా? 70 స్కూల్లో వెతికితే

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories