Prabhas, shyamala devi
Prabhas Marriage: రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్, డార్లింగ్ అని తెలుగు అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ పెళ్లి గురించి చాలా కాలంగా డిస్కషన్ నడుస్తుంది. పెళ్లి ఎప్పుడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గత పదేళ్లుగా ఈ కామెంట్ వినిపిస్తున్నా ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.
ప్రభాస్ ఇంతకి పెళ్లి చేసుకుంటాడా? లేక జీవితాంతం బ్యాచ్‌లర్‌గానే ఉండిపోతాడా? అనేది పెద్ద సందేహంగా మారింది. ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది గతంలో కృష్ణంరాజుని అడిగేవారు. కానీ ఆయన కన్నుమూశారు. రెండేళ్ల క్రితం కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవిని అడుగుతున్నారు.
త్వరలో ఉంటుంది? పెళ్లి అనేది రాసి పెట్టి ఉంటుందని, ఆ టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా అవుతుందని, తాము కూడా వెయిట్ చేస్తున్నామని ఆమె చెబుతూ వచ్చింది.
krishnam raju, shyamala devi
తాజాగా మరోసారి శ్యామలాదేవికి ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆమె చెన్నైలో తెలుగువారు జరుపుకునే ఉగాది వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి ఛానెల్ శ్యామలాదేవితో చిట్ చాట్ జరపగా ఇందులో డార్లింగ్ పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది.
ఇందులో శ్యామలా దేవి మాట్లాడుతూ, `ప్రభాస్ పెళ్లి కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. మేమే కాదు ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. ఆ శుభ గడియలు వస్తాయి. భగవంతుడు ఒక స్త్రీకి, పురుషుడికి రాసి పెడతాడు. ఆ టైమ్ వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. మీరంతా హ్యాపీ అవుతారు` అని చెప్పింది.
prabhas
ఎలాంటి అమ్మాయి కావాలి? అనే ప్రశ్నకి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రియాక్ట్ అవుతూ, `మాది పెద్ద ఫ్యామిలీ. అందరం కలిసి హ్యాపీగా ఉంటాం. అలా కలిసిపోయే అమ్మాయి అయితే చాలా ఇష్టం ప్రభాస్‌కి. ఎప్పుడూ సరదాగా ఉండాలి. వేరే వాళ్లని విమర్శించడం, ఇతరుల గురించి నెగటివ్‌గా మాట్లాడటం నచ్చదు.
కృష్ణంరాజుకి, ప్రభాస్‌కి గానీ అలా ఉంటే నచ్చదు. ఎవరి గురించైనా మంచిగా మాట్లాడుకోవాలి, సరదాగా కబుర్లు చెప్పుకోవాలి, అలాంటి వారినే ఇష్టపడతారు` అని చెప్పింది కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.