ఎపిసోడ్ ప్రారంభంలోనే లాస్య తులసి వాళ్ళతో ఇప్పుడు కోర్టులు,గొడవలు ఎందుకు నేను కేవలం నందు మనసులో చిన్న స్థానాన్ని మాత్రమే కదా అడుగుతున్నాను. అది కూడా ఇవ్వలేకపోతే ఎలాగా నందుకి నచ్చజెప్పితే ఇంకే గొడవలు ఉండవు కదా అని అంటుంది. అప్పుడే వచ్చిన రాములమ్మ ఇందాకటి నుంచి వింటున్నాను లాస్యమ్మగారు అడిగిన దాంట్లో అర్థం ఉన్నాది కదా. అప్పుడు తులసమ్మ గారు నందు బాబు విడిపోయినప్పుడు కూడా మీరు ఏం చేయలేకపోయారు. కనీసం వీళ్ళనైనా కలపండి.