Prema Entha Madhuram: మాన్సీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. మళ్లీ ఎంట్రీ ఇచ్చిన జోగమ్మ!

Published : Jun 17, 2023, 07:08 AM IST

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తోటికోడలికిస్తున్న గౌరవాన్ని భరించలేక అసూయతో పగిలిపోతూ ఆమెని కష్టాలపాలు చేస్తున్న ఒక శాడిస్ట్ తోటి కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Prema Entha Madhuram: మాన్సీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. మళ్లీ ఎంట్రీ ఇచ్చిన జోగమ్మ!

 ఎపిసోడ్ ప్రారంభంలో మాన్సీ ఎవరితోనో మాట్లాడడం నా చెవులతో నేను విన్నాను అంటుంది అంజలి. అంజలి అబద్ధం చెప్పింది నేను ఎవరితోనూ మాట్లాడలేదు అంటుంది మాన్సీ. ఎవరితోనూ మాట్లాడకపోతే ఎందుకు మళ్లీ మీ ఇంటికి రానివ్వను అని అన్నావు. తన మీద ఒక కన్నేసి ఉంచు అని ఎవరితో చెప్పావు అంటూ నిలదీస్తుంది అంజలి.
 

28

 నేను ఎవరితోను ఏమీ మాట్లాడలేదు. అనుకి నాకు చిన్న చిన్న క్లాషెస్ ఉన్నాయి కాదనను కానీ మరి ఆమెని ఇంట్లోంచి బయటికి పంపించేసేటంత క్రూయాలిటీ  నాకు లేదు. అయినా తనని బయటకు పంపించవలసినంత అవసరం నాకు ఏముంది అంటుంది  మాన్సీ. తనంటే నీకు జలసీ.. ఆమెకి ఈ ఇంట్లో ఇస్తున్న గౌరవం చూసి నీకు ఓర్వలేనితనం అన్నింటికీ మించి ఈ ఆస్తిని దక్కించుకోవాలనే తపన అంటుంది అంజలి.
 

38

నాకేమీ అలాంటి బుద్ధి లేదు ఇంకా మాట్లాడితే నీకే అలాంటి బుద్ధి ఉంది అందుకే నీరజ్ ని ట్రాప్చేసి పెళ్లి చేస్తున్నావు అంటుంది మాన్సీ. తనకి అంత అవసరం లేదు నువ్వు అనవసరంగా టాపిక్ మార్చకు ఫోన్ లో ఎవరితో మాట్లాడావో చెప్పు అంటాడు నీరజ్. నేను కళ తో మాట్లాడాను మాన్సీ. కళ ఎవరు అన్నట్లుగా చూస్తారు అందరూ. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ పనిమనిషిగా చేసింది కదా తనే కళ.
 

48

తిండికి లేక పని కావాలంటూ ఫోన్ చేసింది. తను చేసిన పనికి తనని ఇంటికి రానిచ్చేది లేదు అంటూ మాట్లాడాను అంటుంది  మాన్సీ. తను అబద్ధం చెప్తుంది అంటుంది అంజలి. జరిగిన దాంట్లో నీ హస్తం లేకపోతే పర్వాలేదు ఒకవేళ అంజలి చెప్పిందే నిజమైతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు  ఆర్య. ఈరోజు నువ్వు గెలవచ్చు కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది ఆరోజు నువ్వు ఇంట్లోంచి బయటికి, అను సగర్వంగా ఇంట్లోకి వస్తుంది చూడు అని చెప్పి వెళ్ళిపోతుంది అంజలి.
 

58

 అలాంటి రోజు నేను రానిస్తే కదా అనుకుంటుంది మాన్సీ. మరోవైపు పిల్లలిద్దర్నీ ఆడిస్తూ ఉంటుంది అను. ఇద్దరు ఒకేసారి ఏడవటంతో వాళ్ళిద్దర్నీ ఊరుకోబెట్టలేక సతమతమవుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి వచ్చిన బామ్మ ఇద్దరు గడుగ్గాయిలే ఎలా ఊరుకో పెడతావో ఏంటో అంటుంది. ఆర్య మాట్లాడినట్లుగా మాట్లాడుతుంది అను. అమ్మని ఇబ్బంది పెట్టొద్దు బుద్ధిగా ఉండండి అని ఆర్య చెప్పినట్లుగా చెప్తుంది.
 

68

ఇద్దరూ ఏడుపు ఆపేసి అను మాటలే వింటుంటారు. పిల్లలిద్దరూ తెలివితేటలకి ఆనందపడుతుంది బామ్మ. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న సరదాలు ఆయన మిస్ అవుతున్నారు అంటూ బాధపడుతుంది  అను. ఆయన మంచి కోసమే కదా మన ఇదంతా చేస్తున్నావు అయినా మీరందరూ కలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది అంటుంది బామ్మ. సీన్ కట్ చేస్తే అను తీసుకువచ్చే వరకు బ్రో ఇన్ లా ప్రశాంతంగా ఉండేటట్టు లేరు.
 

78

ఏం చేస్తే ఆయన అను జోలికి పోకుండా ఉంటారు అంటూ ఆలోచనలో పడుతుంది  మాన్సీ. అదే జోగమ్మ  ని బ్రో ఇన్ లా ని కూడా మానిప్లేట్ చేయమంటే ఎలా ఉంటుంది అనుకుంటూ జోగమ్మ కి ఫోన్ చేసి తను ఏం చేయాలో చెప్తుంది. ఆ తరువాత ఆర్య నీరజ్ వాళ్ళు ఇంట్లోంచి బయటికి బయలుదేరబోతుంటే ఎదురుగా జోగమ్మ నిలబడుతుంది. అక్కడే ఆగిపోయేవేం జోగమ్మ లోపలికి రా అంటుంది శారదమ్మ.
 

88

 నేను రాను మీ ఇంట్లో ప్రతి ఒక్కరిని సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ ఇంటి దీపం ఎటో వెళ్లిపోయింది అందుకే ఈ వెతుకులాట అంటుంది జోగమ్మ. మీరు వెతుకుతున్న కొద్దీ ఆమె మరింత దూరం అవుతుంది ఇంకా చెప్పాలంటే ఆమె ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది అంటూ హెచ్చరిస్తుంది జోగమ్మ. ఆ మాటలు విన్న ఆర్య షాక్ అవుతాడు. ఇదంతా చూస్తున్న తన గది విండో నుంచి చూస్తున్న మాన్సీ సంతోషిస్తుంది. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories