Published : Jun 17, 2023, 08:08 AM ISTUpdated : Jun 17, 2023, 10:16 AM IST
రాముడిగా బాలకృష్ణ నటించిన చిత్రం `శ్రీరామరాజ్యం`. ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. చాలా మంది సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్లు పెడుతున్నారు. `ఆదిపురుష్` విడుదల సందర్భంగా ఈ మూవీ ట్రెండ్ కావడం ఆశ్చర్యపరుస్తుంది.
బాలకృష్ణ.. రాముడిగా నటించిన చిత్రం `శ్రీరామరాజ్యం`. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సీతగా నయనతార, లక్ష్మణుడిగా శ్రీకాంత్ నటించారు. ఈ సినిమా 2011లో విడుదలై ఆకట్టుకుంది. కానీ పెద్ద విజయం సాధించలేదు. నీట్‌గా మనవైన కాస్ట్యూమ్స్ తో, రాముడంటే ఎలా ఉండాలో అలా బాలకృష్ణ పాత్రని తీర్చిదిద్దిన తీరు ఇలా అన్ని యాంగిల్‌లో `శ్రీరామరాజ్యం` నిజంగానే రామాయణాన్ని తలపిస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. చాలా మంది ఆడియెన్స్ ఇప్పుడు దీన్ని చూస్తున్నారు. కారణం మాత్రం ఆశ్చర్యపోయేలాఉంది.
25
ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం `ఆదిపురుష్`. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటించింది. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. దీనికి మిశ్రమ స్పందన లభిస్తుంది. చాలా మంది దీనిపై విమర్శలు చేస్తుండగా, యూత్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకు నచ్చే చిత్రమని అంటున్నారు. సూపర్ హీరోల తరహాలో మేకింగ్ చేయడంతో పిల్లలు ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు.
35
Adipurush Movie Reel Vs Real
అయితే ఎక్కువగా దీనిపై విమర్శలు వస్తున్నాయి. రామాయణాన్ని తలతోక లేకుండా తీశాడని, అంత షార్ట్ కట్ లో ఉందని అంటున్నారు. అయితే పెద్దవాళ్లకి, గతంలో రామాయణం పై వచ్చిన సినిమాలు చూసినవారికి ఈ చిత్రం నచ్చడం చాలా కష్టం. మోడ్రన్ స్టయిల్‌లో ఇది సాగడంతో పెద్దవారికి మింగుడు పడన విధంగా ఉంది. అందుకే చాలా మంది ఇప్పుడు బాపు రూపొందించిన బాలకృష్ణ నటించిన `శ్రీరామరాజ్యం` సినిమాని చూస్తున్నారు. తాజాగా ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. `ఆదిపురుష్` వల్ల బాపు `శ్రీరామరాజ్యం` విలువేంటో తెలిసిందని అంటున్నారు.
45
రాముడిగా బాలకృష్ణ ఒదిగిపోయాడని, లక్ష్మణుడిగా శ్రీకాంత్ పర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యాడని, సీతగా నయనతార తప్ప మరెవ్వరిని ఊహించుకోలేమని అంటున్నారు. ఆ ఫోటోలు, క్లిప్పు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతోపాటు ఎన్టీఆర్ నటించిన `లవకుశ`, జూ ఎన్టీఆర్ బాల `రామాయణం`, `ఈ నేపథ్యంలో `ఆదిపురుష్` కారణంగా అవి తెరపైకి వస్తున్నాయి. ట్రెండింగ్‌లోకి రావడం గమనార్హం. ఇప్పుడు ఆయా సినిమాలకు ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు.
55
ఇక `ఆదిపురుష్` పై ఎన్ని విమర్శలు వచ్చినా, ఇది తొలి రోజు మాత్రం రికార్డులు క్రియేట్ చేయబోతుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకి సాధ్యం కాని విధంగా భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయి. అడ్వాన్స్ సేల్స్ విషయంలోనే ఇది రికార్డులు క్రియేట్ చేసింది. యూఎస్‌లోనూ ఇది ఇప్పటికే ఒక మిలియన్ దాటింది. మొత్తానికి ఫస్డ్ డే `ఆదిపురుష్` నయా రికార్డులు క్రియేట్ చేయబోతుందని చెప్పొచ్చు. ఇక ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఓటీటీ, డిజిటల్ ద్వారానే ఏకంగా రూ.250కోట్లు రాబట్టుకుంది. తెలుగుతోపాటు సౌత్‌లో థియేట్రికల్ రైట్స్ రూ.185కోట్లకి అమ్ముడు పోయింది. నార్త్, ఓవర్సీస్‌లో టీమ్ సొంతంగా రిలీజ్ చేసింది. పైగా ఈ సినిమా నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇది భారీగా చేసే అవకాశం ఉంది.