నా మాట కాదంటే నా నగలన్నీ నీ భార్యకి ఇచ్చేస్తాను అంటూ పందెం కడుతుంది రాజ్యలక్ష్మి. ఇంతలో దివ్య, విక్రమ్ కిందికి దిగి బయటికి వెళ్తున్నాము అని రాజ్యలక్ష్మి కి చెప్తారు. అదేంటి పూజ ఉంచుకొని ఎక్కడికి వెళ్తావు అంటుంది రాజ్యలక్ష్మి. అంతలోనే అక్కడికి వచ్చిన పూజారి గారు ఈరోజు పూజ మానేస్తే మీ అమ్మగారి ఆరోగ్యం కోసం ఇన్నాళ్లు చేసిన పూజ ఫలితం అంతా పోతుంది అంటారు.