Prema Entha Madhuram: మరదలికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. మాన్సీ చెంప పగలగొట్టిన అను!

Published : May 16, 2023, 07:11 AM IST

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. మూర్ఖత్వంతో ఇంటిని రణరంగం చేస్తున్న ఒక పెద్దింటి కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Prema Entha Madhuram: మరదలికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. మాన్సీ చెంప పగలగొట్టిన  అను!

ఎపిసోడ్ ప్రారంభంలో ఇలాంటి శిక్ష ఇప్పటివరకు ఎలాంటి కింగ్ వెయ్యలేదు. ఫస్ట్ టైం మీరే వేస్తున్నారు ఒక ఆడపిల్లని ఇంత బాధ పెడుతున్నారు ఇది ఎక్కడ న్యాయం అంటుంది మాన్సీ. నీకు ఏం కావాలి మాన్సీ నీరజ్ ఆ, ఫ్యామిలీయా, వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆ అని అడుగుతాడు ఆర్య. మాన్సీ ఏమి మాట్లాడదు.
 

29

అవన్నీ నీ చేతిలో పెట్టి మూడు నెలలు ముందు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాము నువ్వు వాటిలో ఏ ఒక్కదానికైనా న్యాయం చేసావా అని నిలదీస్తాడు ఆర్య. నేను న్యాయం చేయలేదు కరెక్టే మరి అంజలి ఏం న్యాయం చేసిందని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు అంటుంది మాన్సీ. తను వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరువు కాపాడింది.
 

39

కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది అన్నింటికీ మించి తన జీవితాన్ని త్యాగం చేసింది అంటాడు ఆర్య. తనకి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి నందిని ఇండస్ట్రీస్ ను అమ్మకుండా ఆపి ఎండి అయింది అది త్యాగమా? నీరజ్ ని పెళ్లి చేసుకుని వచ్చి ఇంట్లో తిష్ట వేసింది ఇది త్యాగమా అంటుంది మాన్సీ. నీ ఈగోని నీ అహంకారాన్ని పక్కనపెట్టి ఆలోచించు సమాధానాలు నీకే దొరుకుతాయి.
 

49

నీ ప్రవర్తనలో మార్పు వస్తే బాగుంటుంది లేదంటే పరిణామాలు నీ ఊహకి కూడా అందవు అంటూ మరదలు కి వార్నింగ్ ఇచ్చి భార్యని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆర్య. నువ్వు ఎంత విసిగిస్తున్నా ఆర్య అంతా ఓపికగా సమాధానం చెప్తున్నాడు అంటే అది నీ అదృష్టమే ఇకనైనా నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో అని మాన్సీ ని మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారదమ్మ.
 

59

ఎవరికైనా అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది దురదృష్టం తలుపు తీసే వరకు తడుతుంది కానీ మీ విషయంలో అది రివర్స్ అవుతుంది మీరు ఎన్ని తప్పులు చేసినా అదృష్టం తలుపు తడుతూనే ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి లేదంటే మీకే సమస్య అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జెండే. అందరూ నాకు సలహా ఇచ్చే వాళ్లే అంటూ ఫ్రెస్టేట్ అవుతుంది మాన్సీ.
 

69

మరోవైపు తన రూమ్ లో అను కొంచెం కంగారు పడుతుంది. ఏం జరిగింది అంటాడు ఆర్య. మనం సొంత ఇంటికి వచ్చేసామని బేబీకి కూడా తెలిసినట్లుగా ఉంది అందుకే అటు ఇటు కదులుతున్నాడు అంటుంది అను. నీ ఫీలింగ్స్ ఏంటి అని భార్యని అడుగుతాడు ఆర్య. నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నాకు బంగ్లాలో ఉన్నప్పుడు రేకుల షెడ్ లో ఉన్నప్పుడు ఒకేలాంటి ఫీలింగ్.
 

79

ఎందుకంటే నా స్థానం ఎప్పుడూ మీ హృదయంలోనే అంటుంది అను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాతోపాటు వచ్చేసావు ఒక్క మాట అనగానే నీ జాబ్ కి రిజైన్ ఇచ్చేసావు ఇదంతా ఎలా సాధ్యం అంటాడు ఆర్య. నా దృష్టిలో నేను వేరు మీరు వేరు కాదు మీరు నేను బేబీ ముగ్గురిదీ ఒకటే ప్రాణం. నాకు నాకన్నా మీరే ఎక్కువ అంటుంది అను. రెండు రోజుల్లో డెలివరీ అప్పుడే అష్టమి కూడా వస్తుంది నాకు భయంగా ఉంది అంటుంది. నీకేమీ భయం లేదు నీ పక్కన నేను ఉంటాను. నీకేమీ భయం లేదు అంటూ ధైర్యం చెప్తాడు ఆర్య.

89

మరోవైపు పూజకి ఇవన్నీ సిద్ధం చేసుకుని దీపం పెట్టడానికి రెడీ అవుతుంది అంజలి. ఆ దీపపు కుందెను కిందకి తోసేస్తుంది మాన్సీ. ఏం చేస్తున్నావ్ అంటూ కసురుకుంటుంది అంజలి. ఇంతలో శారదమ్మ, అను అక్కడికి వస్తారు విషయం తెలుసుకుని మాన్సీ ని మందలిస్తారు. నన్ను అంటారెందుకు? దీపం పెట్టే హక్కు తనకి ఎక్కడిది.. నాకే ఆ హక్కు ఉంది అంటుంది మాన్సీ. మరి ఏనాడైనా నువ్వు దీపం పెట్టావా అని అడుగుతుంది శారదమ్మ. అంటే నేను దీపం పెట్టకపోతే తను పెట్టేస్తుందా. అసలు తను ఈ ఇంట్లో ఎవరు నీరజ్ కి భార్యా.. ఇంటి కోడలా.. లేకపోతే బ్రో ఇన్ లా ఉంచుకున్న మనిషా అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది మాన్సీ.
 

99

దీంతో మాన్సీ చెంప పగలగొడుతుంది అను. నీరజ్ సార్ గురించి గానీ అంజలి మేడం గురించి గానీ సార్ గురించి గానీ తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తుంది అను. తను నన్ను కొట్టింది మీరు చూస్తూ ఊరుకుంటారేంటి అని శారదమ్మ ని నిలదీస్తుంది మాన్సీ. తను కాబట్టి చేత్తో కొట్టింది తన ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే చెప్పుతో కొట్టేవారు అంటూ అసహ్యించుకుంటుంది శారదమ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories