Intinti Gruhalakshmi: దివ్యకి ధైర్యం చెప్పిన తులసి.. తులసిగా అవతారం ఎత్తిన లాస్య?

First Published Jan 24, 2023, 9:24 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో తులసి, దివ్య కి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఆడపిల్లలు బంగారం కంటే ఎక్కువ, ఎంత గొప్పగా చూసుకోవాలి ఎంత భద్రంగా దాచుకోవాలి నువ్వే చెప్పు అనడంతో దివ్య ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మనం మంచి వాళ్ళు కావచ్చుక అలానే మనం చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోవడం మన తప్పే. మృగాళ్లు తిరుగుతున్న సమాజం ఇది ఏ జంతువు ఎప్పుడు మీద పడి గాయం చేస్తుందో తెలియదు. ఆడపిల్ల బయటికి వెళ్లిందంటే తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేవరకు ఆడపిల్ల తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితులు వచ్చాయి అంటుంది తులసి.
 

తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి మీరు బయట తిరగవచ్చు కానీ అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అవుతుంది అని అంటుంది. దివ్య తులసి మాటలకు ఎమోషనల్ అవుతూ జీవితంలో ఇంకెప్పుడు నేను అబద్ధాలు చెప్పను మామ్. నువ్వు చెప్పినట్టే ఉంటాను అని చెప్పే తులసిని హత్తుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తర్వాత తులసి దివ్యకి గోరుముద్దలు తినిపించి దివ్యని పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు నందు రెడీ అవుతూ ఉండగా లాస్య నిద్రపోతూ ఉండడంతో మొబైల్ ఫోన్లో పాటలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు నందు దీనికి పక్కన మొగుడు లేకపోయినా పర్లేదు కానీ మొబైల్ ఉండాలి అనుకుంటూ ఉంటాడు.

 అప్పుడు నందు పాటలు ఆఫ్ చేయగా లాస్య మళ్లీ పాటలు ఆన్ చేసుకుంటుంది. దాంతో నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే పనిమనిషి రాములమ్మ ఎదురు కావడంతో లాస్యమ్మ తొందరగా లేపమని చెప్పింది అయ్యా అని అనగా నిద్ర లేపడం అంటే అంత ఈజీ కాదు సంవత్సరం నుంచి అదే తిప్పలే పడుతున్నాను అని నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పనిమనిషి రాములమ్మ లాస్యను నిద్ర లేపడానికి వెళ్లి నిద్ర లేపిన నిద్ర లేవకపోవడంతో వెంటనే ఎలాగైనా తిక్క కుదర్చాలి అని బకెట్లో నీళ్లు తీసుకొని వచ్చి లాస్య ముఖంపై చల్లుతుంది. అప్పుడు లాస్య నిద్ర లేచి పనిమనిషిని తిట్టడంతో అవును ఈరోజు నుంచి నేను రెడీ అవ్వాలి కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లాస్య.
 

ఆ తర్వాత అనసూయ పరంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో తులసి అంకిత అక్కడికి వస్తారు. అప్పుడు అనసూయ ఏంటి తులసి కాఫీ ఇవ్వడం మర్చిపోయావు నువ్వు కూడా లాస్య లాగా పొదుపు చేస్తున్నావా అనగా లేదు అత్తయ్య అని అంకిత నిన్ను కాఫీ ఇవ్వమని చెప్పాను కదా ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని అడుగుతుంది. అప్పుడు ఇంతకుముందు లాగే ఫ్రిజ్ డోర్ కి, రాక్స్ కి అన్నింటికి కీస్ వేసుకుని ఉన్నాయి అనడంతో, ఇదంతా ఆ లాస్య పనైనా ఇంతకుముందు గట్టిగా చెప్పాను మళ్ళీ ఇలాగే చేస్తుందా అనడంతో ఇంతకుముందు తన పర్మిషన్ తీసుకొని అన్ని చేయాలనేది కానీ ఇప్పుడు అన్ని పనులు తానే చేస్తాను అని అంటుంది అంకిత.

 మరి ఈపాటికి రావాలి కదా ఎక్కడె లాస్య అని అడగడంతో తెలియదమ్మా అంటుంది రాములమ్మ. మరొకవైపు లాస్య కట్టుబొట్టు అన్ని అచ్చం తులసి లాగే తయారయ్యి అది చూసి మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. నందు అక్కడికి రావడంతో నందు నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది లాస్య. నందు వెనుకవైపు నుంచి చూసి రాములమ్మ అనుకొని ఇల్లు తుడవడం అయిపోగానే కాఫీ తీసుకొని వచ్చి ఇవ్వు రాములమ్మ నేను వెళ్లి ఫ్రెష్ గా వస్తాను అనే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఈ నందుకు అసలు టేస్ట్ లేదు రాములమ్మకి తులసికి లాస్యకి తేడా తెలియదా అనుకుంటూ ఉంటుంది. అయినా ఈ నందు జడ్జిమెంట్తో నాకు అనవసరం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాస్య.

మరొకవైపు శృతి రెడీ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వచ్చి శృతిని వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేమ్, శృతిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. తరువాత తులసి సరదాగా మాట్లాడడంతో ప్రేమ్ శృతి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే లాస్య తులసి లాగా రెడీ అయ్యి కాఫీ తీసుకొని ఇక్కడికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయి లాస్య వైపు అలాగే చూస్తూ ఉంటారు. అది చూసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య ఓవరాక్షన్ చేస్తూ పాదాలకు దండం పెడుతూ అందరికీ కాఫీ ఇస్తుంది. అప్పుడు అందరూ లాస్య వైపు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు పరంధామయ్య లాస్య మీద సెటైర్స్ వేయడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు.

click me!