Karthika Deepam: మోనితను చంపేసిన దీప.. ఒకటైన డాక్టర్,బాబు వంటలక్క?

First Published Jan 24, 2023, 7:54 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 23వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 
 

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత సంతోష పడుతూ ఉండగా దీప మోనిత చేతిలో గన్ను లాక్కోవడంతో నన్ను ఇంత మోసం చేస్తావా అనడంతో దగ్గరికి రావద్దు చంపేస్తాను అంటుంది దీప. అప్పుడు కార్తీక్, దీప ఆ గన్ నా చేతికి ఇవ్వు అనడంతో లేదు డాక్టర్ బాబు, నా మాట విని మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అత్తయ్య పిల్లలని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను చెప్పింది చేయండి అంటుంది దీప. అప్పుడు సౌందర్య కార్తీక్ వాళ్ళు పిల్లలను పిలుచుకొని కిందికి వెళ్లిపోతారు. అప్పుడు సౌందర్య పిల్లలు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో కార్తీక్ ఒంటరిగా అక్కడే మిగిలిపోతాడు. అప్పుడు ఇప్పుడు చెప్పవే నీకు నా మొగుడు కావాలా అనడంతో మోనిత నవ్వుకుంటూ గరిట పట్టుకున్న చేత్తో గన్ను పట్టుకున్నావు నువ్వు నన్ను ఏమి చేయగలవు అనడంతో ఏదైనా చేయగలను అంటుంది దీప.
 

 వేలు పెట్టి ఎవరు నొక్కిన గన్ను బుల్లెట్ బయటకు వస్తుంది నొక్కనా అనడంతో మోనిత భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది. నా మొగుడు వెనకాల ఎందుకు పడుతున్నావు దీప అడగగా మొన్నటి వరకు కూడా నువ్వు ఇలాగే వెంటపడ్డావు కదా అక్క ప్రేమే కదా నాది కూడా ప్రేమనే అంటుంది మోనిత. ప్రేమ కోసం ఏం చేసినా తప్పు లేదు అక్క అంటూ ఎంతో నైస్ గా మాట్లాడుతూ ఉంటుంది మోనిత. మరోవైపు బాంబులో టైం అయిపోతూ ఉంటుంది. అప్పుడు మోనిత దీపని కావాలనే రెచ్చగొడుతూ ఇంతకుముందు చాలాసార్లు ఇలాగే గన్ పెట్టి బెదిరించావు నన్ను ఏమి చేయలేవు కదా దీపక్క అంటుంది. అప్పుడు దీప చేతులతో తుపాకీ ఉండడంతో అది చూసే మోనిత టెన్షన్ పడుతూ, భయం పడుతూ ఉంటుంది.
 

అప్పుడు మోనిత భయంతో నన్నేం చేయకు ప్లీజ్ అది నొక్కితే నా ప్రాణాలు పోతాయి నువ్వు చనిపోయిన కూడా కార్తీక్ రాను నా మాట నమ్ము నేను కార్తీక్ ని డిస్టర్బ్ చేయను అంటుంది. దేవుడు ఇన్నాళ్లు లేడు అనుకున్నాను ఉన్నాడు అందుకే నాకు ఇంతవరకు ఆయుషును ఇచ్చాడు. నీ ప్రాణాలు నా చేతిలో గాల్లో కలిసిపోతాయి అంటూ దీప మోనిత షూట్ చేస్తుంది. అప్పుడు కార్తీక్ భయంతో ఇంట్లోకి పరుగులు తీస్తాడు. అప్పుడు దీప, మోనిత వైపు చూసి షాక్ అవుతుంది. అప్పుడు మోనిత కిందపడిపోవడంతో అది చూసి దీప ఏడుస్తూ నాతో ఎంత పని చేయించావు మోనిత అనుకుంటూ ఉండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వస్తాడు. అప్పుడు మోనితను చూసి షాకైన కార్తీక్ నాతో ఎన్ని పనులు చేయించావు మోనిత అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు.
 

నేను కల్లో కూడా అనుకోలేని పనులు చేసావ్ అంటూ కార్తీక్ కూడా మోనిత వైపు చూసి బాధపడుతూ ఉంటాడు. నన్ను అంతలా మోసం చేసావు నాకోసం అంతలా తాపత్రయపడ్డావు కానీ చివరికి ఏం సాధించావు ఇలా దిక్కులేని చావు చచ్చావు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కార్తిక్ తన చేతితో మోనిత కళ్ళు మూసి దీపను పిలుచుకునే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దీప కార్తీక్ వెళ్లి కారులో కూర్చోగా ఇంతలోనే మోనిత బాంబు తీసుకుని వచ్చి కార్తీక్ కారులో వేసి నాకు దక్కని కార్తీక్ ఎవరికి దక్కకూడదు అనుకుని చనిపోతుంది. మరొకవైపు సౌందర్య వాళ్ళు కార్లో ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు సౌర్య అమ్మ కోసమే నేను ఇలా చేశాను అనడంతో నువ్వు నన్ను మాట్లాడించకు నానమ్మ కారు ఆపు అని అంటుంది శౌర్య.
 

 అప్పుడు సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా స్వారీ సౌర్య ఏమయ్యింది అని హిమ అనడంతో నేను నీతో రాను అంటుంది. సౌందర్య అక్కడికి వచ్చి ఆగు సౌర్య ఏం చేస్తున్నావ్ అనడంతో నేను హిమతో రాను నానమ్మ ఆనంతో మీ అమ్మ నాన్న చెప్పిన మాటలు మరచిపోయావా అనడంతో నాకు అన్ని గుర్తున్నాయి నానమ్మ కానీ ఈ హిమతో నేను ఉండలేను అని సౌర్య ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌందర్య హిమ వాళ్ళు ఎంత పిలిచినా కూడా శౌర్య పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌందర్య వాళ్ళు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరొకవైపు దీప, కార్తీక్ కారులో వెళ్తూ ఉండగా అప్పుడు దీప డాక్టర్ బాబు నా చివరి క్షణాలు నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అనడంతో అలా మాట్లాడకు దీప అని అంటాడు కార్తీక్.

 హిమ సౌర్య అత్తయ్య వాళ్లను ఆఖరి సారి చూసుకోకుండానే పంపించేసాను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది దీప. కానీ మీరు మాత్రం నాతోనే ఉండిపోయారు. అప్పుడు దీప ఊపిరి ఆడటం లేదు డాక్టర్ బాబు అనడంతో నీకేం కాదు దీప నా వైపు చూడు అని కార్తీక్ టెన్షన్ గా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడకు దీప కొద్దిసేపు సైలెంట్ గా ఉండు అనగా నన్ను కొద్దిసేపు నన్ను మాట్లాడనివ్వండి డాక్టర్ బాబు కొద్దిసేపు అయితే ఎలాగో నేను బతకను కదా అని అనగా అలా మాట్లాడకు దీప అంటాడు. నాకు కూడా చనిపోవాలని లేదు డాక్టర్ బాబు కానీ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అంటుంది దీప.
 

 నాకు ఆఖరి క్షణంలో నీ భార్యగా చనిపోతున్నాను నాకు ఇది చాలు ఇంతకంటే నాకేం కావాలి అని అనగా దీప కాసేపు సైలెంట్ గా ఉండు నేను నిన్ను రక్షించుకుంటాను అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటాడు కార్తీక్. డాక్టర్ బాబు నా ఆఖరి కోరిక తీరుస్తారా ఒక్కసారి కారు ఆపండి డాక్టర్ బాబు అన్నంతో నేను ఆపను దీప నేను నిన్ను రక్షించుకుంటాను అంటాడు. ఆఖరి కోరిక అనుకొని కారు ఆపండి డాక్టర్ బాబు అనడంతో కార్తీక్ కారు ఆపుతాడు. అప్పుడు కార్తీక్, దీప కోరిక మేరకు చివరిసారిగా ఏడడుగులు నడుస్తూ కొంచెం ముందుకు వెళ్తారు. అప్పుడు దీప కార్తీక్ ఇద్దరు గతంలో జరిగిన విషయాలు అన్ని తలుచుకుంటూ ఈయన అడుగులు వేసి ముందుకు నడవడంతో ఇంతలోనే కారు పేలిపోవడంతో అది చూసి దీప కార్తికే ఇద్దరు షాక్ అవుతారు. నీ చివరి కోరిక నన్ను నిన్ను ఇద్దరిని రక్షించింది దీప అంటాడు కార్తీక్. నువ్వు ఉండగా నా ప్రాణాలకు ఏమీ కాదు దీప నీతో వేసిన అడుగులే మనిద్దరి ప్రాణాలు నిలబెట్టాయి.
 

ఇప్పుడు చెప్పు బతుకుతామన్న ఆశ నీకు లేదా అనడంతో ఉంది అని దీప కార్తీక్ గుండెలపై వాలిపోతుంది. మరోవైపు సౌందర్య వారణాసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వారణాసి కనిపించని వారణాసి ఎందుకంటే కనిపించకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు మన కంటికి ఎలా కనిపిస్తారు అనగా ఆ కారు బ్లాస్ట్ అయినప్పుడు చూశానమ్మా అందులో కార్తీక్ సార్ దీపమ్మ ఆనవాళ్లు అందులో ఏమీ లేవు అనడంతో అప్పుడు సౌందర్య ఆలోచిస్తూ అంటే ఆ మోనిత లోపల చావకుండా వీళ్ళను ఏదో చేయాలని బయట వరకు వచ్చింది అది తప్పించుకొని నా కొడుకు కోడలు ఇద్దరు బయటపడ్డారు అన్నమాట అనుకుంటూ ఉంటుంది. మరోవైపు దీప కార్తీక్ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు మనిద్దరం ఇలాగే ఉంటాం, ఇదే శాశ్వతం అవుతుంది వంటలక్క అనడంతో అవునా కార్తీక్ అనగా వాళ్ళిద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు కార్తీక్ దీపం ఇద్దరూ గతంలో జరిగిన విషయాలు తలచుకొని ఒకరితో ఒకరు బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు.

click me!