సెలబ్రిటీలకు మించి దివ్వెల మాధురి పారితోషికం.. దాన్ని ఏం చేయబోతున్నారో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే

Published : Nov 03, 2025, 01:56 PM IST

ఫైర్‌ బ్రాండ్‌ అంటూ బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి వెళ్లిన దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చిన మూడో వారమే హౌజ్‌ నుంచి వచ్చేసింది. సెలబ్రిటీల రేంజ్‌లో పారితోషికం తీసుకున్న దివ్వెల మాధురి దాన్ని ఏం చేయబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

PREV
14
బిగ్‌ బాస్‌ 9 తెలుగు నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9షో ఏపీ పొలిటికల్‌ సెన్సేషన్‌ దివ్వెల మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారం ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె హౌజ్‌లోకి వచ్చి మూడు వారాలు మాత్రమే ఉంది. ఈ ఆదివారం ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. గౌరవ్‌ గుప్తా, దివ్వెల మాధురి ఓటింగ్‌లో లీస్ట్ లో ఉన్నారు. ఆయన కంటే కొద్ది పాటి ఓట్ల తేడాతో మాధురి ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. అయితే ఆమె నామినేషన్‌లోకి రావడమే ఎనిమిదో వారంలో వచ్చింది. వచ్చిన వెంటనే ఎలిమినేట్‌ కావాల్సి రావడం గమనార్హం. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ అని భావించిన ఆమె ఊహించని విధంగా హౌజ్‌ని వీడాల్సి వచ్చింది.

24
దివ్వెల మాధురి బిగ్‌ బాస్‌ పారితోషికం

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ షోకి వచ్చినందుకు దివ్వెల మాధురికి ఎంత పారితోషికం ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఆమెకి సెలబ్రిటీ రేంజ్‌లో రెమ్యూనరేషన్‌ తీసుకుందట. వారానికి ఏకంగా మూడు లక్షలు తీసుకుందని తెలుస్తోంది. అంటే ఆమె రోజుకి రూ.40వేలకుపైగా పారితోషికం ఇచ్చారు. ఇంతటి పారితోషికం టాప్‌ సెలబ్రిటీలకు మాత్రమే ఇస్తారు. అది మాధురికి దక్కడం విశేషం. అంతకు ముందు ఆమె కాంటవర్సీలకు కేరాఫ్‌గా నిలిచింది. దువ్వాడ శ్రీనివాస్‌తో ప్రేమ, పెళ్లి వ్యవహారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మారింది. మీడియాలో, సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్‌ నిర్వాహకులు ఆమెకి ఈ రేంజ్‌లో పారితోషికం ఇచ్చారట.

34
దివ్వెల మాధురికి సెలబ్రిటీ రేంజ్‌ రెమ్యూనరేషన్‌

దివ్వెల మాధురి మూడు వారాలు హౌజ్‌లో ఉంది. దీంతో ఆమె దాదాపు రూ.9లక్షల పారితోషికం అందుకుంది. మొత్తానికి గట్టిగానే తీసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ పారితోషికాన్ని ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే దివ్వెల మాధురి స్వతహాగా రిచ్‌. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్‌ బాగా రిచ్‌. వారికి చాలా వ్యాపారాలున్నాయి. దీనికితోడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అమౌంట్‌ వారికి చాలా చిన్నదిగా ఉండొచ్చు. దీనిపై దువ్వాడ శ్రీనివాస్‌ స్పందించారు. మాధురికి వచ్చే బిగ్‌ బాస్‌ పారితోషికాన్ని ఏం చేయబోతున్నారనేది వెల్లడించారు.

44
మాధురి పారితోషికం ఏం చేయబోతుందో తెలుసా?

10టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ మాధురి విన్నర్‌గా నిలిస్తే ఆ వచ్చిన ప్రైజ్‌ మనీని వికలాంగుల కోసం వాడతానని చెప్పారు. తమకు దేవుడు ఇచ్చింది చాలు అని, ఇంకా అవసరం లేదన్నారు. అయితే చాలా మంది వికలాంగులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి బాగు కోసం, వారి సంక్షేమం కోసం ఈ డబ్బుని ఖర్చు చేస్తామని తెలిపారు. అదే సమయంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న పేదవారి కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. తాను రెగ్యూలర్‌గానే ఇలాంటి సర్వీస్‌ చేస్తుంటానని, అందులో భాగంగానే ఈ బిగ్‌ బాస్‌ అమౌంట్‌ ఎంత వస్తే అంతా వారి కోసం కేటాయిస్తానని చెప్పారు. తాజాగా మాధురి బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. రెండు వారాల క్రితమే ఆయన ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories