సూపర్‌స్టార్‌ కృష్ణ ఘరానా దొంగతో పోటీ పడి చావు దెబ్బతిన్న శోభన్‌ బాబు మూవీ ఏంటో తెలుసా? రెండింటిలో శ్రీదేవినే

Published : Nov 03, 2025, 10:43 AM IST

సూపర్‌స్టార్‌ కృష్ణ, సోగ్గాడు శోభన్‌ బాబు చాలా సార్లు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. అయితే ఓ సారి హిట్ కావాల్సిన సోగ్గాడి మూవీని ఫ్లాప్‌ చేశారు కృష్ణ. ఆ కథేంటో తెలుసుకుందాం. 

PREV
14
కృష్ణ, శోభన్‌ బాబు మధ్య బాక్సాఫీసు వార్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ, సోగ్గాడు శోభన్‌ బాబు ఇద్దరూ ఓ దశలో నువ్వా నేనా అనేలా సినిమాలు చేశారు. విజయాలు అందుకున్నారు. కృష్ణ యాక్షన్‌ సినిమాలతో దుమ్మురేపుతుంటే, శోభన్‌ బాబు ఫ్యామిలీ చిత్రాలతో ఇంటిళ్లిపాదిని అలరించారు. ఇద్దరు కలిసి కూడా చాలా సినిమాలు చేశారు. అయినా ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఫ్యాన్స్ వార్‌ కూడా ఉండేది. అంతకు ముందు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ మధ్య పోటీ ఎలాగో, కృష్ణ, శోభన్‌ బాబు మధ్య అలాంటి పోటీ ఉండేది. ఎవరి జోనర్‌లో వాళ్లు దుమ్ములేపేవారు. అయితే కొన్నిసార్లు ఈ ఇద్దరి సినిమాలు పోటీ పడ్డాయి. ఓ సారి సోగ్గాడిని గట్టి దెబ్బ కొట్టాడు కృష్ణ.

24
ఘరానా దొంగతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న సూపర్‌ స్టార్‌

1980లో కృష్ణ 17 సినిమాల్లో నటించాడు. అంతకు ముందు 1972లో అత్యధికంగా 18 సినిమాలు చేశారు కృష్ణ. ఆ తర్వాత ఈ ఏడాది అత్యధిక సినిమాలు ఆయన్నుంచి విడుదలయ్యాయి. ఈ ఏడాదిలో `భలే కృష్ణుడు`, `కొత్తపేట రౌడీ`, `ఘరానా దొంగ`, `రామ్‌ రాబర్ట్ రహీమ్‌`, `చుట్టాలున్నారు జాగ్రత్త` మూవీస్‌ బాగానే ఆడాయి. అందులో పెద్ద హిట్‌ అంటే `ఘరానా దొంగ` అనే చెప్పాలి. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ఇందులో శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 29న విడుదలైంది. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన రెండో మూవీ ఇది కావడం విశేషం. మొదట  `భలే కృష్ణుడు` చేశారు. అది కూడా హిట్‌. దాన్ని మించిన హిట్‌ `ఘరానా దొంగ` కావడం విశేషం. ఈ మూవీ నిజానికి మార్చి 27న రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో రెండు రోజుల తర్వాత విడుదల చేశారు. ఏదేమైనా సినిమా బంపర్‌ హిట్‌గా నిలిచింది.

34
`కక్ష` మూవీతో నష్టాలు చూసిన సోగ్గాడు

ఈ సినిమాకి ముందు రోజే సోగ్గాడు శోభన్‌ బాబు నటించిన `కక్ష` చిత్రం విడుదలైంది. దీనికి వీసీ గుహనాథన్‌ దర్శకత్వం వహించారు. ఇది కూడా యాక్షన్‌ మూవీగానే తెరకెక్కింది. ఇందులోనూ సోగ్గాడి సరసన అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. మోహన్‌ బాబు, మురళీ మోహన్‌, కైకాల వంటి భారీ కాస్టింగ్‌ ఉంది. రామానాయుడు నిర్మించారు. ఈ చిత్రానికి కూడా మంచి టాకే వచ్చింది. ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. సోగ్గాడి మూవీ అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్‌ ఉంటుంది. పైగా శ్రీదేవి ఉందంటే ఆ క్రేజ్‌ వేరే లెవల్‌. దీంతో సినిమా రచ్చ చేస్తుందని టీమ్‌ భావించింది.

44
`కక్ష`ని దెబ్బ కొట్టిన `ఘరానా దొంగ`

కానీ ఆ తర్వాత వచ్చిన సూపర్‌ స్టార్‌ కృష్ణ మూవీ `ఘరానా దొంగ` గట్టి దెబ్బ కొట్టింది. కలెక్షన్ల పరంగా ఇది దుమారం రేపింది. కృష్ణ కమర్షియల్‌ సినిమా ముందు సోగ్గాడి `కక్ష` నిలవలేకపోయింది. `కక్ష` మూవీ కలెక్షన్లపై గట్టి ప్రభావం చూపింది. దీంతో బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన `కక్ష` చివరికి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఎనిమిది లక్షలు నష్టపోవాల్సి వచ్చిందట. మొత్తంగా కృష్ణతో పోటీగా వచ్చి సోగ్గాడు నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని చెప్పొచ్చు. కానీ ఈ రెండు సినిమాల్లో శ్రీదేవినే హీరోయిన్‌ కావడం విశేషం. ప్రతి హీరోకి ఇలాంటి అనుభవాలు చాలానే ఉంటాయి. కంటెంట్‌ని, సీజన్‌ బట్టి సినిమాలు ఆడతాయి. అదే సమయంలో పోటీగా వస్తోన్న సినిమా కూడా చాలా ప్రభావం చూపుతాయనేది నిజం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories