రవితేజ హీరోగా నటించిన `మాస్ జాతర` మూవీ ఈ శుక్రవారం నుంచి ప్రీమియర్స్ తో విడుదలైంది. మిశ్రమ స్పందన రాబట్టుకున్న ఈ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ గా `మాస్ జాతర`తో అలరించేందుకు వచ్చారు. ఈ మూవీ ఈ శుక్రవారం నుంచి ప్రీమియర్స్ తో విడుదలైన విషయం తెలిసిందే. శనివారం నుంచి పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యింది. `బాహుబలి ది ఎపిక్` మూవీ ఈ చిత్రానికి పెద్ద దెబ్బగా మారిందని చెప్పొచ్చు. రిలీజ్ విషయంలోనూ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయగా, కలెక్షన్ల పరంగానూ కోలుకోలేని దెబ్బ కొడుతుంది. దీంతో ఈ చిత్రం వసూళ్ల పరంగా బాక్సాఫీసు వద్ద పోరాటం చేయాల్సి వస్తోంది.
25
మాస్ జాతర మూడు రోజుల బాక్సాఫీసు వసూళ్లు
ఇక రవితేజ హీరోగా వచ్చిన `మాస్ జాతర` మూవీ మూడు రోజుల్లో పది కోట్లు దాటింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ తో ఐదు కోట్లు వసూలు చేసినట్టు టీమ్ ప్రకటించింది. ఇక శనివారం మార్నింగ్ షోస్‌తో విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.5.4కోట్లు రాబట్టిందట. మూడో రోజు మూడు కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ మూడు రోజుల్లో దాదాపు రూ.13-14కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇండియాలో ఈ మూవీ దాదాపు రూ.9కోట్లు రాబట్టింది. వీకెండ్ రెండు రోజులే రావడంతో ఈ సినిమాకి మైనస్‌గా మారింది. శుక్రవారం కలెక్షన్లకి దెబ్బ పడింది.
35
మాస్ జాతర బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్
`మాస్ జాతర` చిత్రానికి దాదాపు రూ.30కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఈ లెక్కన ఈ మూవీ ఇంకా యాభై కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయాలి. కానీ ఈ కలెక్షన్లు చూస్తే అది సాధ్యమేనా అనేది ప్రశ్నగా మారింది. సోమవారం నుంచి మరింత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. కలెక్షన్లు చాలా వరకు డ్రాప్ అవుతాయి. మొత్తంగా ఇది ఇరవై కోట్ల గ్రాస్ వరకు వెళ్లడం కూడా కష్టమనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. అదే జరిగితే ఈ మూవీ ద్వారా నిర్మాత నాగవంశీ దారుణంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా రూపొందిన `మాస్ జాతర` చిత్రాన్ని నూతన దర్శకుడు భాను భోగవరపు రూపొందించారు. నాగవంశీ నిర్మించారు. నవంబర్ 1 నుంచి రెగ్యూలర్ షోస్‌తో ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో రవితేజ రైల్వే ఎస్‌ఐగా నటించారు. అడవివరంలో గంజాయి స్మగ్లర్ నవీన్ చంద్రని అడ్డుకునేందుకు రవితేజ చేసే పోరాటమే ఈ చిత్రం. రెగ్యూలర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. రవితేజ మార్క్ కామెడీ ఫర్వాలేదు, కానీ థియేటర్లలో ఆ కామెడీ అంతగా పండలేదు. అదే మైనస్‌గా చెప్పొచ్చు. కానీ యాక్షన్ సీన్లు బాగున్నాయి.
55
బ్యాక్ టూ బ్యాక్ ఐదు ఫ్లాపులతో రవితేజ
ఇక రవితేజకిది వరుసగా ఇది ఐదో ఫ్లాప్ మూవీ కావడం గమనార్హం. `ధమాఖా`, `వాల్తేర్ వీరయ్య` తర్వాత రవితేజకి హిట్ లేదు. `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు`, `ఈగల్`, `మిస్టర్ బచ్చన్` ఇప్పుడు `మాస్ జాతర` సైతం ఫ్లాప్ దిశగా వెళ్తుంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఐదు ఫ్లాప్ మూవీస్ తో రవితేజ మార్కెట్ మరింతగా డౌన్ అవుతుంది. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, సొంతంగా హీరోగా ఎదిగిన రవితేజ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. టాప్ హీరోల్లో ఒకరిగా మెప్పించారు. కానీ ఇటీవల ఆయన ఎంపిక చేసుకుంటున్న కథలు, చేస్తున్న సినిమాలు నిరాశపరుస్తూ అభిమానులను సైతండిజప్పాయింట్ చేస్తున్నాయి. ఆయన కౌంట్ కోసం కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్క హిట్ ప్లీజ్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరి ఇకనైనా రవితేజ మంచి వినోదాత్మక చిత్రాలతో వస్తారేమో చూడాలి.