బిగ్ బాస్ తెలుగు 9లో సండే ఎపిసోడ్ లో దివ్వల మాధురి ఎలిమినేట్ అయ్యారు. తనూజకి ఆమెని సేవ్ చేసే అవకాశం ఉన్నా చేయలేదు. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకోండి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ సండే ఎపిసోడ్ లో ఊహించని పరిణామం ఎదురైంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఫైర్ బ్రాండ్ దివ్వల మాధురి ఎలిమినేట్ అయ్యారు. దివ్వల మాధురి, గౌరవ్ గుప్తా ఇద్దరూ ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నారు. తెలుగు మాట్లాడేందుకు కూడా తడబడుతున్న గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అవుతాడని కొందరు భావించారు. కానీ దివ్వల మాధురి ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వెళ్లారు.
25
బిగ్ బాస్ వేదికపై రష్మిక
ఈవారం నామినేషన్స్ లో రాము, తనూజ, మాధురి, గౌరవ్ గుప్తా, రీతూ చౌదరి, పవన్, సంజన, కళ్యాణ్ ఉన్నారు. వీరిలో ముందుగా పవన్ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత బిగ్ బాస్ వేదికపైకి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నటీనటులు రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి వచ్చారు. నాగార్జున వారిని అడిగి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విశేషాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించారు. ఏదైనా సినిమాలోని సన్నివేశం చూపిస్తారు. ఇంటి సభ్యులు ఆ సీన్ ని రీ క్రియేట్ చేసి నటించి చూపించాలి.
35
పోకిరి సీన్ రీ క్రియేట్ చేసిన కళ్యాణ్, తనూజ
రష్మిక వారి పెర్ఫార్మెన్స్ కి మార్కులు ఇవ్వాలని నాగార్జున కోరారు. ఇమ్మాన్యుయేల్ ప్రతి రోజూ పండగే చిత్రంలో రావు రమేష్ డైలాగులు చెప్పి అలరించారు. కళ్యాణ్, తనూజ పోకిరి మూవీలో లిఫ్ట్ సీన్ ని రీ క్రియేట్ చేశారు. భరణి యమదొంగ చిత్రంలో ఏమంటివి ఏమంటివి డైలాగ్ చెప్పారు. ఇలా రష్మిక ఉన్నంత సేపు సరదాగా సాగింది.
ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేసే ప్రక్రియ వేగవంతం అయింది. సంజన, కళ్యాణ్, రాము సేవ్ అయ్యారు. మరో రౌండ్ లో తనూజ కూడా సేవ్ అయింది. చివరికి నామినేషన్స్ లో గౌరవ్, మాధురి మాత్రమే మిగిలారు. వారిని గార్డెన్ లో ఉన్న కారులో కూర్చోమని నాగార్జున అడిగారు. ఆ కారు బయటకి వెళుతుంది. ఒకరు మాత్రమే హౌస్ లోకి తిరిగి వస్తారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాధురి అతి తక్కువ ఓట్లతో ఉన్నారు. తనూజ వద్ద గోల్డెన్ బజర్ ఉంది. తనూజ దానిని ఇప్పుడైనా, ఇంకెప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.
55
మాధురి ఎలిమినేటెడ్
ఇప్పుడు ఉపయోగించి మాధురిని సేవ్ చేసే అవకాశం నీకు ఉంది. అది నీ ఇష్టం అని నాగార్జున అడిగారు. కానీ తనూజ మాత్రం దానిని తాను తర్వాత ఎప్పుడైనా వాడతానని.. ఇప్పుడు మాధురిని సేవ్ చేయడం లేదని సంచలన నిర్ణయం తీసుకుంది. దీనితో నాగార్జున మాధురి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీనితో మాధురి బిగ్ బాస్ వేదికపై వెళ్లి నాగార్జునని కలిసింది. ఎలిమినేట్ అవుతావని ఊహించావా అని నాగార్జున ప్రశ్నించగా మాధురి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నేను ఊహించాను, వాస్తవానికి నేనే వెళ్లిపోవాలని అనుకున్నాను. ఎందుకంటే త్వరలో మా ఆయన బర్త్ డే ఉంది అని మాధురి పేర్కొంది. ఆ తర్వాత మాధురి తనూజ తో ఉన్న రిలేషన్ ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది, హౌస్ లో తనూజ, కళ్యాణ్ ఇద్దరూ చాలా స్వీట్ అని తెలిపింది. హౌస్ లో ఫేక్ అంటే మాత్రం అది భరణి గారే. ఆయన బ్యాక్ బిచింగ్ చేస్తారు అంటూ షాకిచ్చింది.