మహేష్ బాబు తండ్రి పాత్రకు రజినీకాంత్ ను అడిగిన దర్శకుడు ఎవరు? సూపర్ స్టార్ ఏమన్నారంటే?

Published : Mar 18, 2025, 03:16 PM IST

ఇద్దరు సూపర్ స్టార్లు తండ్రీ కొడుకులుగా మిస్ అయిన బ్లాక్ బస్టర్  సినిమా, మహేష్ బాబు తండ్రిగా రజినీకాంత్ ను నటించమని అడిగిన దర్శకుడు. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏంటా సినిమా? రజినీకాంత్ ఏమన్నారు? 

PREV
16
మహేష్ బాబు తండ్రి పాత్రకు రజినీకాంత్ ను అడిగిన దర్శకుడు ఎవరు?  సూపర్ స్టార్ ఏమన్నారంటే?

అసలు ఎవ్వరైనా ఊహించి ఉంటారా? సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రిగా మరో సూపర్ స్టార్ రజినీకాంత్. స్క్రీన్ మీద చూడటానికే ఎంత బాగుంటుందో కదా. అసలు ఈ కాంబినేషన్ నిజంగా వర్కౌట్ అయ్యి ఉంటే బాక్సాఫీస్ రికార్డ్ లు మోత మోగిపోయేవి కదా..?

ఇద్దరు సూపర్ స్టార్లు సిల్వర్ స్క్రీన్ మీద కనపడి ఉంటే పాన్ఇండియా రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యేవి. కాని అది కుదరలేదు. అసలు ఈ కాంబో తెరపైకి రాలేదు కూడా. ఇంతకీ వీరి కాబినేషన్ ను సెట్ చేద్దాం అని ప్రయత్నం చేసిన దర్శకుడు ఎవరు? ఎందుక ఇది వర్కౌట్ అవ్వలేదు. ఈ ప్రపోజల్ కు రజినీకాంత్ ఏమన్నారు. ఇంతకీ ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఎదో తెలుసా? 

26

మహేష్ బాబు తండ్రిగా రజినీకాంత్ ను మాట్లాడటానికి వెళ్ళిన దర్శకుడు ఎవరో కాదు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమా మరేదో కాదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అవును ఈసినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ను తీసుకోవాలి అని ప్రయత్నం చేశారట. శ్రీకాంత్ అడ్డాల. అంటే మహేష్ బాబుతో పాటు వెంకటేష్ కు కూడా రజినీకాంత్ తండ్రి పాత్ర చేయాల్సి ఉంది. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ పాత్రలో ముందుగా రజినీకాంత్ ను అనుకున్నాడట దర్శకుడు. 

Also Read: రస్నా యాడ్ లో ఉన్న చిన్నారి, రాజమౌళి హీరోయిన్ ఎవరో తెలుసా?
 

36

ఈ విషయం రూమర్ కాదు,గాలి వార్త అంతకన్నా కాదు. నిజం  స్వయంగా దర్శకుడు శ్రీకాంత్  అడ్డాల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నిజం. ఆయన ఏమన్నారంటే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాశ్ రాజ్ చేసిన తండ్రి పాత్ర కోసం రజినీకాంత్ గారిని అడిగాను అన్నారు. అంతే కాదు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని చెన్నెై వెళ్లి కథ కూడా చెప్పి వచ్చాడట దర్శకుడు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అపాయింట్మెంట్ ఇచ్చారట. రజినీకాంత్. 

Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

46

కథ మొత్తం విన్న రజినీకాంత్ ఈసినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారట. కాని అప్పటికే ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తుండటంతో..ఈసినిమాను చేయలేకపోయారట. అన్ని కుదిరితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రేలంటి మావయ్య పాత్రలో తలైవర్ రజినీకాంత్ కనిపించేవారు. మరి ఈ పాత్రలోసూపర్ స్టార్ ఎలా ఉండేవారో, సినిమా రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు. 

Also Read: 21,000 కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియా హీరోకి భార్య ఎవరో తెలుసా?

56
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

కాని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా దాదాపు 11ఏళ్ళ క్రితం రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా, ప్రకాశ్ రాజ్, జయసుధ వీరి తల్లీ తండ్రులుగా, అంజలీ, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ కుటుంబ కథా చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ రెస్పాన్స్ ను రాబట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు ఈ సినిమాను.

Also Read: నిర్మాతలను భయపెడుతున్న బులిరాజు, రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్

66

అయితే ఈసినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ తో పాటు ప్రకాశ్ రాజ్ పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రేలంగి మామయ్యగా ఆయన పాత్ర ప్రతీ కుటుంబంలోకి వెళ్ళింది. సహజనటి జయసుధ సాధారణ ఇల్లాలి పాత్రలో అదరగొట్టారు. ఇక సమంత, అంజలి గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.  
 

Read more Photos on
click me!

Recommended Stories