రస్నా యాడ్ లో ఉన్న చిన్నారి, రాజమౌళి హీరోయిన్ ఎవరో తెలుసా?

90స్ బ్యాచ్ కు మర్చిపోలేని యాడ్ రస్నాయాడ్. అందులో ఓ చిన్నారి చాలా క్యూట్ గా కనిపిస్తుంది కదా. ఆమె టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా? రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించిందని తెలుసా? ఇంతకీ ఎవరా బ్యూటీ.? 
 

Rasna Ad Girl Who Became Rajamouli's Heroine: Here's Who She Is in telugu jms

ఒకప్పుడు దూరదర్శన్ లో రస్నా యాడ్ చాలా ఫేమస్. సమ్మర్ వచ్చిందంటే టేస్టీ టేస్టీ రస్నా యాడ్ చూస్తూనే నోరు ఊరిపోయేది. ఆ యాడ్ కు తగ్గట్టే అందులో కనిపించిన పాప చాలా క్యూట్ గా ఉండేది. ఆమె రస్నాను ఆస్వాదిస్తున్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ తొ అందరిని ఆకట్టుకుంది ఆ పాప. ఇంతకీ ఆ పాప ఎవరో తెలుసా? ఆతరువాత ఆమె హీరోయన్ అయ్యింది తెలుసా? టాలీవుడ్ సినిమాల్లో.. అది కూడా రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించిందని  తెలుసా? అంతే కాదు హీరోయని్ గా ఫెయిడ్ అవుటు అయ్యి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారు? 

Rasna Ad Girl Who Became Rajamouli's Heroine: Here's Who She Is in telugu jms

ఈ పాప ఎవరో కాదు హీరోయిన్ అంకిత. అంకిత అంటే అర్ధం అవుతుందో లేదో తెలియదు కాని..సింహాద్రి సినిమా హీరోయిన్ అంటే మాత్రం అందరికి అర్ధం అవుతుంది.  చీమ చీమ అంటూ ఎన్టీఆర్ తో అదిరిపోయే డ్యూయోట్ వేసుకున్న హీరోయిన్ గుర్తుండే ఉంటుంది. రస్నా యాడ్ లో కనిపించిన చిన్నారి ఈ హీరోయినే.  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా ఇద్దరు హీరోయిన్ల నటించారు. 


భూమికతో పాటు అంకిత కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భూమిక పాత్ర బోల్డ్ సీన్స్ కు దూరంగా ఉంటే.. అంకిత చేత ఎక్కవగా ఎక్స్ పోజింగ్ చేయించారు. ఈసినిమాలో అంకిత గ్లామర్ తో సింహాద్రి సినిమాకు కాస్త కలర్ యాడ్ అయ్యింది. రస్నా యాడ్ తరువాత చైల్డ్ ఆర్టిస్ట్ గా అంకిత తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. రస్నా యాడ్ లో కనిపించిన ఈ చిన్నారి ఆ తర్వాత రస్నా బేబీ గా గుర్తింపు తెచ్చుకుంది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయన్ గా తేరంగేట్రం చేసిన అంకిత.. ఆతరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. 
 

ఇక హీరోయిన్ గా సింహాద్రి, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు, నవవసంతం ఇలా ఎన్నో సినిమాల్లో అంకిత అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. మంచి మంచి సినిమలు చేస్తున్న టైమ్ లోనే అంకిత సడెన్ గా సినిమాలకు దూరం అయింది. విశాల్ అనే వ్యక్తిని పెళ్ళాడిన అంకిత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందుబాటులో ఉంటోంది. 
 

Latest Videos

click me!