jabardasth varsha, immanuel
Jabardasth Vrasha-Immanuel: జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్ లాగానే జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయెల్ మధ్య కెమిస్ట్రీ నడిచింది. బాగా పాపులర్ అయ్యారు. చాలా కాలం కలిసి స్కిట్లు చేస్తున్నారు. మధ్యలో వేర్వేరుగా స్కిట్లు చేశారు. మళ్లీ ఇటీవల ఒకే టీమ్‌లో వర్క్ చేస్తున్నారు, కానీ జోడీగా చేయడం లేదు.
jabardasth varsha, immanuel
కానీ వీరిద్దరి కాంబినేషన్‌ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఆ మధ్య బాగా కలిసి స్కిట్లు మాత్రమే కాదు, ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలిపారు. ప్రపోజల్‌తోపాటు డ్యూయెట్లు పాడుకున్నారు. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. పెళ్లి పీఠల వరకు వెళ్లారు. ఇదంతా జబర్దస్త్ షోలో బాగా వర్కౌట్ అయ్యింది. టీఆర్‌పీ రేటింగ్ పెంచడానికి ఉపయోగపడింది.
jabardasth varsha, immanuel
కానీ ఓ దశలో చాలా విమర్శలు వచ్చాయి. దీంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది జబర్దస్త్ టీమ్. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయారు. అయితే ఈ సారి స్కిట్ కాదు, చూడబోతుంటే రియల్‌గానే ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. ఇమ్మాన్యుయెల్, జబర్దస్త్ వర్ష కలిసి `తండేల్` మూవీ స్కిట్ చేశారు. పాత్రల్లో ఇన్‌వాల్వ్ అయి రక్తికట్టించారు. నిజంగానే బుల్లితెరపై సినిమా చూపించారు.
jabardasth varsha, immanuel
అనంతరం యాంకర్ రష్మి గౌతమ్.. వర్షని ప్రశ్నించింది. వర్ష.. ఇమ్మూతో ఇది నీకు చివరి పర్‌ఫెర్మెన్స్ అనుకోవచ్చా? అని అడిగింది. దీనికి వర్ష స్పందిస్తూ, ఇమ్మూ ఇక్కడ ఎంత మంది ఉన్నా, నువ్వు లేకపోతే బాగోదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే వెళ్లి ఇమ్మాన్యుయెల్‌ని హగ్ చేసుకుంది. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయెల్ సైలెంట్ అయిపోయారు.