మిస్సింగ్ మేఘన ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ, బెక్కం వేణుగోపాల్, శ్రీనివాస్ సపోర్ట్ తో వాచస్పతి దర్శకుడిగా వస్తున్న సినిమా `మిస్సింగ్ మేఘన`. ఈ సినిమా తో హీరో రామ్ కార్తీక్ కి, దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి. అదే విధంగా ధృవన్ మ్యూజికల్ ఆల్ రౌండర్ పాటల రాస్తాడు మ్యూజిక్ చేస్తాడు అతడికి సినిమాతో మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను` అని అన్నారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, వి. వి. వినాయక్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వాచస్పతి గారికి, ప్రొడ్యూసర్ నరేష్ గారికి ధన్యవాదాలు. కచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది` అని అన్నారు.