Nani: నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమాలేంటో తెలుసా ? ఫ్లాప్ హీరోతో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మూవీ

Published : Aug 05, 2026, 06:09 PM IST

Natural Star Nani: హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమాలు ఏవి? వాటి బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి ఆసక్తికర వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

PREV
15
Nani

హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నాని.. ఇండస్ట్రీలోకి మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. బాపు, కె. రాఘవేంద్రరావు, శ్రీను వైట్ల, సురేష్ కృష్ణ వంటి దిగ్గజ దర్శకుల వద్ద పనిచేస్తూ సినీ నిర్మాణంలోని ట్రిక్స్ నేర్చుకున్నారు. ఆసక్తికరంగా, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్లు కాగా, మరికొన్ని ఘోర పరాజయాలు చవిచూశాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫ్లాప్ హీరోతోనే నిర్మాతగా సినిమా చేస్తుండటం విశేషంగా మారింది.

25
రాధాగోపాళం

లెజెండరీ డైరెక్టర్ బాపు గారి వద్ద 'రాధాగోపాలం' సినిమాతోనే నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ఈ చిత్ర సెట్‌లో పనిచేయడం నానికి ఒక ఫిలిం స్కూల్‌లా ఉపయోగపడింది. బాపు గారి డిసిప్లిన్, సీన్స్‌ని విజువలైజ్ చేసే విధానం, ఫ్రేమింగ్‌లోని అందం, ఎమోషన్స్‌ను పండించే తీరును నాని ఇక్కడే చాలా దగ్గరుండి నేర్చుకున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

35
అల్లరి బుల్లోడు

కమర్షియల్ సినిమాల బ్రహ్మ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన 'అల్లరి బుల్లోడు' చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. నితిన్, త్రిష నటించిన ఈ సినిమా ద్వారా ఒక పెద్ద కమర్షియల్ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మాస్ ఎలిమెంట్స్ ఎలా ప్లాన్ చేయాలి, పాటల చిత్రీకరణలో పాటించే సూత్రాలని నాని అవగాహన చేసుకున్నారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే నితిన్ హీరోగా నటిస్తున్న అలియాస్ రుక్మిణి చిత్రానికి నాని నిర్మాత. కాలం ఎంత వేగంగా మారిపోయిందో చూశారా ?

45
అస్త్రం

'బాషా' ఫేమ్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో విష్ణు మంచు, అనుష్క హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'అస్త్రం'. బాలీవుడ్ హిట్ 'సర్ఫరోష్' రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా సెట్‌లో పనిచేయడం వల్ల డీటైలింగ్, ఇన్వెస్టిగేటివ్ సీన్స్ తీయడం, యాక్షన్ సన్నివేశాల ప్రణాళికపై నానికి మంచి పట్టు లభించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

55
ఢీ

శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు, జెనీలియా నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ 'ఢీ'. అసిస్టెంట్ డైరెక్టర్‌గా నానికి ఇది అత్యంత ఆసక్తికరమైన అనుభవం. శ్రీను వైట్ల మార్క్ కామెడీ టైమింగ్ ఈ మూవీలో ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. సీన్ డిస్కషన్స్‌లో నాని చురుగ్గా పాల్గొనేవారు. ముఖ్యంగా బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ డిజైనింగ్ వెనుక నాని చేసిన వర్క్, తదనంతర కాలంలో హీరోగా ఆయన నటనలోని టైమింగ్‌కి ఎంతగానో దోహదపడింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories