తమిళ సినిమాలో స్టార్ దర్శకుడు శకర్. జెంటిల్ మేన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తన మొదటి సినిమాతోనే అందరినీ తనవైపు తిప్పుకున్నారు. తర్వాత వరుస సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించారు. కమల్ హాసన్ తో ఇండియన్ సినిమా తీసి భారతీయ సినీ లోకాన్ని తమిళ సినిమా వైపు చూసేలా చేశారు.
ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, 2.0 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో భారతదేశంలోని విజయవంతమైన దర్శకులలో ఒకరిగా నిలిచారు. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అయ్యింది.
Also Read: భన్సాలీతో బన్నీ భేటీ... టాలీవుడ్ పై భారీ ప్లాన్ చేసిన అల్లు అర్జున్..