డా.సమరం ఆయన గురించి తెలియని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో ఒక వయస్సుకు వచ్చిన వారి నుంచి 70 ఏళ్లు దాటిన ముసలివారి వరకూ.. సమరం తో అవసరం ఉన్నవారే. సమరం గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. గోపరాజు సమరం 1970లో విజయవాడలో సాధారణ వైద్యుడిగా తన కెరీర్ ప్రారంభించారు. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు.
ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతీ మనిషి ఏదో ఒక సెక్స్ సమస్యను కలిగి ఉంటారు. కొత్తగా పెళ్ళైన వారికి ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాటిపై అవగాహన కల్పించడంతో పాటు.. అందరికి అర్దం అయ్యేలా రకరకాల వీడియోలు, అవగాహన కార్యక్రమాలు చేసిన వ్యక్తి సమరం. కొన్ని కోట్ల మంది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఉంటారు ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు పరిష్కరించి ఉంటారు.
టీవీలు, సోషల్ మీడియాలేని కాలంలో ఆయన పుస్తకాల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేసేవారు. మరీ ముఖ్యంగా స్వాతి వార పత్రికకు ఇప్పటికీ ఇంత ఆదరణ ఉందంటే దాంట్లో సమరం పాత్ర కీలకంగా ఉంటుంది. శృంగార సందేహాలను స్వాతి బుక్‌కు రాయగా ఆయన వాటికి స్వయంగా సమాధానాలు రాస్తారు. ప్రతివారం స్వాతి మ్యాగజైన్‌న్‌ను సమరం సమాధానాల కోసమే కొనేవారు, ఎదురుచూసేవారు లక్షల్లో ఉంటారు.
ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసిన సమరం... ఓ సినిమాలో కూడా నటించారు. ఆయనకు కెమెరా ఏమీ కొత్త కాదు. కెమెరా ముందే.. సమరం ఎటువంటి సమస్యకు అయినా ధైర్యంగా సమాధానాలు చెప్పారు. ఇప్పటికీ చెప్పగలుగుతున్నారు. ఇక సమరం నటించిన ఆ సినిమా ఏదో కాదు 'మీ కోసం'. ఈసినిమాలో కూడా డాక్టర్ గా సృష్టికార్యానికి సబంధించిన సమస్యను తీర్చే డాక్టర్ గానే ఆయన నటించారు. ఇలా ఓ సారి స్కీన్ పై మెరిసారని ఎవరికి తెలియదు.
ఇక సమరం చేసిన సమాజ సేవలో ఉచిత వైద్యశిబిరాలు, టీకా క్యాంపులు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, హెచ్‌ఐవీ పరీక్షల శిబిరాలు ఇలా చాలా ఉన్నాయి ఆయన ఖాతాలో. అంతే కాదు సమరానికి రెండు రూపాయల డాక్టర్ గా పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా రెండు రూపాయలకే వైద్యం అందిస్తున్నారు.
80 ఏళ్ల వయస్సులో కూడా రోజుకు 15 గంటలకు పైగా పనిచేస్తున్న సమరం తెలుగు ప్రజలకు కొంత మంది మనసులో అడల్ట్ డాక్టర్ గా..మరికొంత మంది మనసులో మంచి చేసే డాక్టర్ గా నిలిచిపోయారు. ఇక ఇప్పటికీ ఈ ఏజ్ లో కూడా ఎన్నో సందేహాలు తీరుస్తున్నారు డాక్టర్ సమరం.