నిందితులు తనని వేధించడం, బలవంతంగా గర్భస్రావం చేయించుకోవడం, బెదిరించడం వంటి ఆరోపణలతో 28 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం పోలీస్ స్టేషన్‌లో మిశ్రపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
మార్చి 6న అత్యాచారం, దాడి, గర్భస్రావం కలిగించడం, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. అందులో భాగంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ) సెక్షన్ 164 కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. గర్భస్రావాలకు సంబంధించిన వైద్యా ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్టు సమాచారం.