sobhan babu
Sobhan babu : శోభన్‌బాబు తెలుగు తెర సోగ్గాడిగా వెలుగొందిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలోనే అందగాడిగా గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఆయన్ని సోగ్గాడిగానే తెలుగు ప్రజలు గుర్తుంచుకున్నారు. ఆరాధిస్తున్నారు. ఆడియెన్స్ మాత్రమే కాదు హీరోయిన్లు కూడా శోభన్‌బాబుని బాగా ఆరాధించేవారు. ప్రేమించేవారు. అలాంటివారిలో జయలలిత పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది.
jayalalitha, sobhan babu
శోభన్‌బాబుని జయలలిత బాగా ఇష్టపడిందని, పెళ్లి వరకు వెళ్లారని, కానీ శోభన్‌బాబునే తిరస్కరించినట్టు తెలుస్తుంది. పెళ్లి చేసుకోకపోవడం వల్లే వీరిద్దరి చరిత్రలో స్థానం సంపాదించారని, మ్యారేజ్ చేసుకుంటే అంతటి గొప్ప ప్రేమగా నిలిచిపోయేది కాదని అంటుంటారు.
అయితే శోభన్ బాబుని జయలలిత మాత్రమే కాదు, చాలా మంది హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపించేవారట. ఆయనపై ప్రేమని చూపించేవారట. కానీ జయలలిత తర్వాత అంతగా ప్రేమించిన హీరోయిన్ కూడా ఉన్నారు.
sobhan babu, sharada
జయలలిత తర్వాత శోభన్ బాబుని అంతగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో కాదు అలనాటి స్టార్ హీరోయిన్ శారద. శోభన్ బాబుని ఆమె అమితంగా ప్రేమించిందని అన్నారు సీనియర్ సినీ జర్నలిస్ట్, విశ్లేషణకులు ఇమ్మంది రామారావు. శారద..
శోభన్‌బాబుని బాగా ఆరాధించిందని, ప్రేమించిందని తెలిపారు. అందుకే కలిసి ఎక్కువగా సినిమాలు చేశారని, అప్పట్లో వీరి కెమిస్ట్రీ బాగా పండిందని, ఇండస్ట్రీలోనూ వీరి కాంబినేషన్‌కి చాలా క్రేజ్ ఉండేదని ఆయన తెలిపారు.
శోభన్‌బాబుతో కంపెనీని అందరు కోరుకునేవారు. ఆయన వద్ద ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, ఆయన వద్ద కూర్చుంటే టైమే తెలియదు. సమ్మోహన ఆకారం, చెప్పే మాటలు కూడా పూలతో మీటినట్టుగా ఉంటుంది.
అందుకే ఆడవాళ్లు కూడా శోభన్ బాబుని ఎక్కువగా లైక్ చేస్తారని, దీంతో అంతర్గత విషయాలు, వ్యక్తిగత విషయాలను కూడా ఆయనతో పంచుకునేవారని చెప్పారు రామారావు. శారద కూడా శోభన్‌బాబుతో ఉండేందుకు ఇష్టపడిందని, ఎన్నో రకాలుగా తన ప్రేమని వ్యక్తం చేసిందన్నారు.
అయితే శారత జీవితాన్ని మార్చేసిన మూవీ `సంబరాల రాంబాబు`. చలం ఇందులో హీరో. చలంకి అప్పటికీ భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. తోడు కోరుకుంటున్నాడు. ఈ మూవీ సమయంలో శారదతో కలిసి నటించడంతో ఆమెతో చనువు ఏర్పడింది. దాన్ని ఆసరాగా తీసుకుని రోజూ తన పర్సనల్ విషయాలను, తన ఒంటరితనాన్ని శారదతో పంచుకునేవాడట.
దీంతో చలం విషయంలో శారద అయ్యో అనుకుంది. ఆయన మాటలకు పడిపోయింది. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత చలం అసలు రంగు బయటపటడంతో కొన్నాళ్ల తర్వాత ఆయన్నుంచి విడిపోయింది. ఆ దెబ్బతో పెళ్లిపై విరక్తి కలిగి ఒంటరిగానే ఉండిపోయింది శారద.
sobhan babu, sharada
ఇక శోభన్ బాబు, శారద కాంబినేషన్‌లో `బలిపీఠం`, `దేవుడు చేసిన పెళ్లి`, `శారద`, `సంసారం`, `ఎవండి ఆవిడ వచ్చింది`, `మిస్టర్ భరత్, `మనుషులు మారాలి`, `మానవుడు దానవుడు`, `పసిడి మనుసులు` వంటి చిత్రాలు చేశారు. దాదాపు అన్నీ సూపర్ హిట్ చిత్రాలే కావడం విశేషం.
అందుకే అప్పట్లో ఈ జంటకి బాగా క్రేజ్ ఉండేదట. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా అదే స్థాయిలో ఉండేదని అంటుంటారు. శోభన్ బాబు 2008లో మరణించగా, శారద ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు.
read more: ఎట్టకేలకు కాబోయే భర్తని పరిచయం చేసిన అభినయ, ఇన్నాళ్ల సస్పెన్స్ కి తెర.. విశాల్‌తో ఆ బంధానికి ముగింపు
also read: ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్ అప్‌డేట్: సందీప్ రెడ్డి వంగా ప్రకటన!