25 సంవత్సరాల కెరీర్‌లో ఒక్క అవార్డు ఫంక్షన్‌కు పిలవలేదు.. నటి షకీలా ఆవేదన

Published : Dec 28, 2025, 04:47 PM IST

Shakeela: ప్రముఖ నటి షకీలా ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న ఇబ్బందులను, కష్టాలను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎదురైన ఒంటరితనం, అవార్డు వేడుకలకు ఎప్పుడూ ఆహ్వానం అందకపోవడం లాంటి విషయాలను చెప్పింది.

PREV
15
మలయాళ చిత్రంతో..

ప్రముఖ నటి షకీలా ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న ఇబ్బందులను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. మలయాళ ఇండస్ట్రీలో తన కెరీర్ పీక్స్‌లో ఉండగా.. సహానటుల నుంచి అసూయ, ఒంటరితనాన్ని ఎదుర్కొన్నానని తెలిపింది. తనతో స్నేహం చేసేందుకు ఎవరూ ముందు రాలేదని.. అందరూ భయపడేవారని ఆమె తెలిపింది.

25
అందరికీ దూరంగా..

షూటింగ్ సెట్స్‌లో తనను ఎప్పుడూ ఇతరులతో దూరంగా ఉంచేవారు. తన కోసం ప్రత్యేక గదిని కేటాయించేవారని షకీలా వివరించింది. ఈ వివక్షతకు విసిగిపోయి, సొంత ఖర్చులతో 20కి పైగా క్యారవాన్‌లను కొనుగోలు చేశాను. వాటిలోనే ఉంటూ, ప్రయాణించేదాన్ని అని చెప్పింది.

35
ఒక్క అవార్డు ఫంక్షన్‌కు..

తన 25 ఏళ్ల కెరీర్‌లో ఒక్క అవార్డు ఫంక్షన్‌కు కూడా ఎవరూ పిలవలేదని షకీలా ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో నెపోటిజం, అవినీతి బాగా పేరుకుపోయిందని షకీలా తెలిపింది. మంచి వ్యక్తులకు సరైన అవకాశాలు రావని, టాలెంటెడ్ తెలుగు, తమిళ అమ్మాయిలు ఉండగా, బాంబే నుంచి హీరోయిన్లను తీసుకువచ్చి కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని విమర్శించింది.

45
ఎంతో ప్రతిభావంతులైన అమ్మాయిలు..

నెల్లూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలు ఉన్నారని, వారికి అవకాశాలు ఇవ్వాలని షకీలా డిమాండ్ చేసింది. తన కుటుంబం, తల్లి, తోబుట్టువుల భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని, బయటి ప్రపంచం తన గురించి ఏమనుకున్నా పట్టించుకోలేదని స్పష్టం చేసింది.

55
క్యాస్టింగ్ కౌచ్ గురించి..

తనకు ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురు కాలేదని షకీలా చెప్పింది. ఒకవేళ ఎవరైనా అడిగి ఉంటే కొట్టేదానినని లేదా, నచ్చితే ఆలోచించేదానినని నవ్వుతూ పేర్కొంది. క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు తోడుగా నిలుస్తానని ఆమె స్పష్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories