Raghavendra Rao: పండు ల్యాండ్‌ అయ్యే కరెక్ట్ ప్లేస్‌ అదే.. హీరోయిన్లపై పండ్ల రహస్యం బయటపెట్టిన రాఘవేంద్రరావు

Published : Oct 05, 2025, 07:43 PM IST

దర్శకుడు రాఘవేంద్రరావు తన సినిమాల్లో హీరోయిన్లపై పూలు, పండ్లు వేయడం అందరికి తెలిసిందే. అయితే పండ్లు ఎక్కడ వేయాలో కనిపెట్టింది తానే అని, దాని వెనుక రహస్యాన్ని ఆయన వెల్లడించారు. 

PREV
15
దర్శకుడు రాఘవేంద్రరావు సినిమా పాటల్లో పూలు, పండ్లు ఫేమస్‌

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అంటే గుర్తుకు వచ్చేది ఆయన సినిమాల్లోని పాటలే. అందులోనూ ఆయన పండ్లని వాడే విధానం మన కళ్ల ముందు కనిపిస్తుంది. హీరోయిన్లపై ఆయన అనేక పండ్లని వేసిన విషయం ఆయన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఒక పనస పండు, వాటర్‌ మిలన్‌ వంటి భారీ సైజ్‌ ఉన్న, వెయిట్‌ ఉన్న ఫ్రూట్స్ తప్ప మిగిలిన అన్ని రకాల పండ్లని ఉపయోగించారు. అదే సమయంలో అన్ని రకాల ఫ్లవర్స్ ని ఉపయోగించారు. ఇవే ఆయన సినిమాల్లో హైలైట్‌గా నిలుస్తాయి. అప్పట్లో ఇవి ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మాస్‌ ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేసేవారు. ఆయన సక్సెస్‌ ఫార్మూలాలో ఇది కూడా ఒక భాగమని చెప్పొచ్చు.

25
హీరోయిన్ల నడుముపైనే పండ్లు ఎందుకు వేస్తారు?

అయితే పండ్లని ఎక్కువగా హీరోయిన్ల నాభిపైనే వేస్తుంటారు రాఘవేంద్రరావు. ఆయన సినిమాల్లో ప్రతి హీరోయిన్‌పై ఇలాంటి ప్రయోగాలు చేశారు. సక్సెస్‌ అయ్యారు. అంతేకాదు అప్పట్లో చాలా వరకు హీరోయిన్లు అది తమ అదృష్టంగా భావించేవారు. వేయకపోతే హర్ట్‌ అయ్యేవారు. ఓ సందర్భంలో రమ్యకృష్ణనే హర్ట్ అయ్యిందట. అంతటి క్రేజ్‌ రాఘవేంద్రరావు సినిమాల్లో పాటలకు, అందులో వాడే పూలు, పండ్లకి ఉంటుందని చెప్పొచ్చు. అయితే వాటి వెనుక ఉన్న రహస్యం చెప్పారు రాఘవేంద్రరావు. పండ్లని ఆయా హీరోయిన్ల నడుముపైనే, నడుముపైనే ఎందుకు వేస్తారు. అందుకు కారణమేంటి? అనేది తెలుసుకుంటే. ఆ విషయాలను రాఘవేంద్రరావు స్వయంగా వెల్లడించారు. చాలా సందర్భాల్లో ఆయనకు ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అసలు విషయాలను బయటపెట్టారు దర్శకేంద్రుడు.

35
హీరోయిన్లపై పండ్ల రహస్యం బయటపెట్టిన దర్శకేంద్రుడు

పండ్లని హీరోయిన్లపైనే ఎందుకు వేస్తారనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి రాఘవేంద్రరావు స్పందిస్తూ, హీరోయిన్లపైన వేస్తేనే పండ్లకి అందం ఉంటుంది. వాటిని చూడగలం. ఆ సీన్‌ చూడ్డానికి ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంటుంది. కానీ అదే అబ్బాయిలపై పండ్లు, పూలు వేస్తే అసహ్యంగా ఉంటుందని తెలిపారట. `అలీతో సరదాగా` షోలో కూడా అలీ ఇదే విషయాన్ని ప్రశ్నించగా, రాఘవేంద్రరావు  వెల్లడించారు. ఈ సందర్భంగానే పండు ల్యాండ్‌ అయ్యే ప్లేస్‌ రహస్యాన్ని ఆయన బయపెట్టారు. మరో సందర్భంలో కూడా ఇదే ప్రశ్న తలెత్తగా, పండు ల్యాండ్‌ అవ్వడానికి నడుము సరైన ప్లేస్‌ అని ఆయన అన్నారు. పండ్లని మరెక్కడ వేసినా అవి నిలవవని, అక్కడే సరిగ్గా ఉండిపోతాయని తెలిపారు దర్శకేంద్రుడు. నడుముపై తప్ప ముఖం మీద వేసినా, తలపై వేసినా, చేతులు, కాళ్లపై ఎక్కడ వేసినా అవి ఉండవన్నారు. ఆయన సమాధానంతో అలీ షో నవ్వులు పూసాయి.

45
ఆపిల్‌ ల్యాండ్‌ అయ్యే ప్లేస్‌ కనిపెట్టాను

అమెరికా వెళ్లినప్పుడు కూడా మరోసారి ఇదే ప్రశ్న ఎదురయ్యింది. దానికి రాఘవేంద్రరావు స్పందిస్తూ మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని, నూట్రన్‌ ఆపిల్‌ కిందపడటాన్ని కనిపెట్టారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టుగా ఆయన కనిపెట్టారు. కానీ తాను మాత్రం ఆపిల్‌ ల్యాండ్‌ అయ్యే ప్లేస్‌ని, అదే సమయంలో ఆ పండు ఎక్కడ పడితే బాగుంటుందో కనిపెట్టానని చెప్పాడట. ఇలా తనకు ఎదురయ్యే ప్రశ్నలకు ఒక్కో సందర్భంలో ఒక్కోలా చెప్పాల్సి వస్తుందన్నారు. ఆయన సమాధానంతో అక్కడ అంతా ఆశ్చర్యపోయారని, అదే సమయంలో ఆ సమాధానం విని షోలో ఉన్న ఆడియెన్స్  కూడా నవ్వులు పూయించారు. గతంలో చాలా రోజుల క్రితం అలీతో సరదాగా షోలో రాఘవేంద్రరావు చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.

55
రాఘవేంద్రరావు అందించిన బ్లాక్‌ బస్టర్స్

రాఘవేంద్రరావు `బాబు` చిత్రంతో దర్శకుడిగా మారారు. `జ్యోతి`, `అమర దీపం`, `అడవి రాముడు`, `డ్రైవర్‌ రాముడు`, `వేటగాడు`, `భలే కృష్ణుడు`, `ఘరానా దొంగ`, `రౌడీ రాముడు కొంటె కృష్ణుడు`, `తిరుగులేని మనిషి`, `కొండవీటి సింహం`, `జస్టీస్‌ చౌదరీ`, `దేవత`, `బొబ్బిలి బ్రహ్మన్న`, `పట్టాభిషేకం`, `అడవి దొంగ`, `కళియుగ పాండవులు`, `కొండవీటి రాజా`, `సాహస సామ్రాట్‌`, `జానకీ రాముడు`, `దొంగ రాముడు`, `అల్లుడుగారు`, `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `కూలీ నెం 1`, `రౌడీ అల్లుడు`, `సుందరాకాండ`, `అల్లరి మొగుడు`, `అల్లరి ప్రియుడు`, `అల్లరి ప్రేమికుడు`, `ఘరానా మొగుడు`, `ఘరానా బుల్లోడు`, `సాహస వీరుడు సాగరకన్య`, `పెళ్లి సందడి`, `బాంబే ప్రియుడు`, `అన్నమయ్య`, `శ్రీరామదాసు` వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రూపొందించారు రాఘవేంద్రరావు. కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచారు. టాలీవుడ్‌ని కమర్షియల్‌ సినిమాల వైపు నడిపించారు. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌కి దూరంగా ఉంటున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories