Atlee: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ కాదు, ఇండియాలోనే ఫస్ట్ డైరెక్టర్ గా అట్లీ రికార్డ్.. ఏం చేశాడంటే?

Published : Dec 31, 2025, 09:24 AM IST

కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ కుమార్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. రాజమౌళి, సుకుమార్‌, ప్రశాంత్ నీల్‌ వంటి టాప్‌ డైరెక్టర్ల కు సాధ్యం కానీ అరుదైన రికార్డుని అట్లీ సాధించారు. ఇంతకి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

PREV
15
ఇండియా టాప్ డైరెక్టర్లు

రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ఇండియన్ సినిమా లెక్కలను మార్చేసిన దర్శకులు. భారీ చిత్రాలతో తమ సత్తాని చాటారు. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ తో రెండు వేల కోట్లు టార్గెట్ చేయగా, ఇప్పటికే రాజమౌళి, సుకుమార్ ఆ టార్గెట్ దగ్గరలోకి వెళ్లారు. ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్ 2`తో ఇప్పటికే వెయ్యి కోట్లు దాటేశారు. ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాతో భారీ టార్గెట్ పెట్టుకున్నారు. బాక్సాఫీసు వద్ద సంచనాలు సృష్టించిన ఈ దర్శకులు అందుకు గానూ కోట్లల్లో పారితోషికాలు అందుకున్నారు. కానీ వీరికి సాధ్యం కానీ ఓ విషయాన్ని దర్శకుడు అట్లీ చేసి చూపించాడు. ఇండియాలోనే ఈ ఘనత సాధించిన తొలి దర్శకుడిగా రికార్డ్ సృష్టించాడు.

25
ఐదు సినిమాలతోనే ఇండియాని షేక్‌ చేసిన అట్లీ

దర్శకుడు అట్లీ ఇప్పటి వరకు చేసింది ఐదు సినిమాలే. `రాజా రాణి` సినిమాతో అందరి ఆలోచనలను తలక్రిందులు చేశారు. బాక్సాఫీసు వద్ద దుమ్మురేపారు. ఆ తర్వాత `థెరి`తో అదరగొట్టారు. `మెర్సల్‌`, `బిగిల్` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్‌ హిట్స్ అందుకున్నారు. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి షారూఖ్‌ ఖాన్‌తో `జవాన్` చిత్రాన్ని రూపొందించారు. ఇది బాలీవుడ్‌లో వెయ్యి కోట్లు కలెక్షన్లని పరిచయం చేసింది. `పఠాన్‌` మూవీ ముందుగా వెయ్యి కోట్లు వసూలు చేసినా, దాన్ని బ్రేక్‌ చేసింది `జవాన్‌`. ఇది ఏకంగా రూ.1150కోట్లు వసూలు చేసింది బాలీవుడ్‌ ఇండస్ట్రీని షాక్‌ కి గురి చేసింది.

35
వెయ్యి కోట్ల బడ్జెట్ తో అల్లు అర్జున్‌, అట్లీ మూవీ

ఇక ఇప్పుడు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌తో సైన్స్ ఫిక్షన్‌ మూవీ చేస్తున్నారు. సూపర్‌ హీరో బేస్డ్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ ప్రధానంగా సాగే చిత్రమిది. ప్రస్తుతం ఆయా వర్క్ లో బిజీగా ఉన్నారు. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మన ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో అల్లు అర్జున్‌, అట్లీ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. వీటితోపాటు `రామాయణ్‌`, `వారణాసి` చిత్రాలు కూడా వెయ్యి కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్న విషయం తెలిసిందే.

45
రోల్స్ రాయిస్ కారు కొన్న ఇండియాలోనే తొలి దర్శకుడు అట్లీ

ఇదిలా ఉంటే వేల కోట్ల సినిమాలు చేస్తున్న ఏ దర్శకుడు ఇప్పటి వరకు రోల్స్ రాయిస్‌ కొనలేదు. వాడలేదు. కానీ ఈ ఘనత సాధించిన తొలి దర్శకుడిగా అట్లీ రికార్డు సృష్టించారు. ఆయన తాజాగా రోల్స్ రాయిస్‌ కారు కొనుగోలు చేశారు. రోల్స్ రాయిస్‌ స్పెక్టర్‌ మోడల్‌కి చెందిన కారుని అట్లీ కొన్నాడు. ఇది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ కారు కావడం విశేషం. రోల్స్ రాయిస్‌ మోడల్‌లో ఇది మొదటి ఎలక్ట్రిక్ కారు కావడం ఇందులో మరో విశేషం. దీని ఖరీదు ఏకంగా రూ.7.5కోట్లు ఉంటుంది. సినిమా సెలబ్రిటీల్లో కొద్ది మందే రోల్స్ రాయిస్‌ కారుని వాడుతున్నారు. వారి జాబితాలో ఇప్పుడు అట్లీ చేరిపోయారు. అదే సమయంలో దర్శకుల్లో మాత్రం ఇండియాలోనే ఫస్ట్ డైరెక్టర్‌ అట్లీ కావడం విశేషం.

55
అల్లు అర్జున్‌, అట్లీ మూవీ అప్‌ డేట్‌

సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతున్న అల్లు అర్జున్‌, అట్లీ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం మూవీకి సంబంధించిన వర్క్ ముంబయిలో జరుగుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్ కి సంబంధించిన షూట్‌ని ముంబాయిలోని ఓ స్టూడియోలో చేస్తున్నారు. అనంతరం ఔట్‌ డోర్ షూటింగ్‌ ఉండబోతుందట. అయితే ఈ మూవీ చాలా వరకు ఇన్‌డోర్‌ షూటింగ్‌ ఉంటుందని, అది సెట్‌ లోనే ఉంటుందని సమాచారం. ఇక ఇందులో ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే దీపికా పదుకొనె ఎంపికైంది. ఆమె వారియర్‌ క్వీన్‌గా కనిపించబోతుంది. ఆమెతోపాటు రష్మిక మందన్నా, జాన్వీ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు సమంత పేరు కూడా వినిపించింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది 2027లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories