Chiranjeevi: చిరంజీవి వల్ల బీటెక్‌లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయిన స్టార్ డైరెక్టర్

Published : Jan 28, 2026, 11:39 AM IST

Chiranjeevi: చిరంజీవికి అభిమానులు ఎక్కువ. ఇప్పటి కుర్ర డైరెక్టర్లు ఎంతో మంది ఒకప్పుడు చిరంజీవికి అభిమానులే. అలాంటి వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఆయన బీటెక్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని సమాచారం. 

PREV
14
చిరంజీవికి అభిమాని

చిరంజీవికి తెలుగు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు డైరెక్టర్లుగా మారి సినిమాలు తీస్తున్న వారు ఎంతోమంది అప్పట్లో చిరంజీవికి బిగ్ ఫ్యాన్స్. అలాంటి వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. వినోదాత్మక చిత్రాలు తీస్తూ హిట్టు మీద హిట్టు కొడుతున్నారు అనిల్ రావిపూడి. చిన్నప్పటి నుంచి అనిల్ రావిపూడకి సినిమాలంటే విపరీతమైన ఇష్టం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే వారంలో మూడు సార్లు చూడాల్సిందే. చిరంజీవి నటించిన సినిమాలు చూసి చూసి ఏదో ఒక రోజు సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికతో పెరిగాడు.

24
బీటెక్ ఫెయిల్

అనిల్ బిటెక్‌ పూర్తి చేసినట్టు అందరికీ తెలుసు. అయితే అది పూర్తి చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చదువుకుంటున్న రోజుల్లో అనిల్ మనసంతా సినిమాల మీదే ఉండేది. ఎప్పుడూ స్క్రీన్ ప్లే, డైలాగులు, సీన్ల గురించి ఆలోచిస్తూ కాలం గడిపేవాడు. స్నేహితులతో కలిసి చిరంజీవి సినిమాల గురించే మాట్లాడేవాడు. దీనివల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోయాడు. దీంతో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. తండ్రి పిలిచి సినిమాల్లోకి వెళ్లాలన్నా కూడా చదువు ముఖ్యమైనవి చెప్పారు. చిరంజీవి అభిమాని పరీక్షలు ఫెయిలవ్వకూడదని అన్నారు. దీంతో అనిల్ రావిపూడి పట్టుదలతో చదివి బీటెక్ పాసయ్యారు. ఇక తర్వాత ఉద్యోగం వంటివి చేయకుండా డైరెక్ట్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.

34
ముందుగా డైలాగ్ రైటర్

అనిల్ రావిపూడికి సినీ పరిశ్రమలో అడుగు పెట్టడం పెద్ద కష్టం కాలేదు. ఎందుకంటే అతని బాబాయి ప్రసాద్ ఇక్కడ డైరెక్టర్ గా పని చేసేవాడు. దాంతో అతని దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిపోయాడు. అక్కడే స్క్రిప్ట్ ఎలా రాయాలో, డైలాగులు ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నారు. కొన్నాళ్లు డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. శౌర్యం, శంఖం, కందిరీగ, ఆగడు వంటి సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశారు. ఆ సినిమాల్లో రాసిన కామెడీ టైమింగ్ వల్ల అతనికి మంచి గుర్తింపు వచ్చింది.

44
చిన్నప్పటి కల

కొన్నాళ్ల తర్వాత అనిల్ పూర్తిస్థాయి డైరెక్టర్ గా మారారు. చిన్నప్పటినుంచి చిరంజీవితో సినిమా తీయాలన్నా కల ఆయనలో ఉండిపోయింది. ఆ కలను నిజం చేసుకున్నారు. మన శివశంకర వరప్రసాద్ సినిమాతో చిరంజీవికి డైరెక్టర్ చేసే అవకాశాన్ని పొందారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. చిరంజీవి అభిమానిగా మొదలైన ఆయన ప్రయాణం చిరంజీవితోనే సినిమా చేసే స్థాయికి చేరడం అనిల్ రావిపూడి జీవితంలో ఒక గొప్ప విజయం అనే చెప్పుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories