అనంతరం మీడియాతో మాట్లాడారు.దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. అప్పుడప్పుడు ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నాం. సినిమాకు, ప్రభుత్వంకు మధ్య బ్రిడ్జి లా ఉండాలనే నన్ను సీఎంగారు FDC చైర్మన్ గా నియమించారు. ఆల్రెడీ సీఎంగారిని కలిసి మాట్లాడటం జరిగింది.