సుకుమార్ ను బండ బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పుష్ప2 లో అల్లు అర్జున్ సీన్ పై అభ్యంతరం..
అల్లు అర్జున్ వివాదం క్లియర్ అవుతుంది అనుకుంటే.. ఇంకాస్త కాంప్లికేట్ అయ్యేలా ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదంతో పాటు మరికొన్ని కొత్త కాంట్రవర్సీలు ఈసినిమా చూట్టు తిరుగుతున్నాయి.
అల్లు అర్జును వివాదం ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడంలేదు. ఒకటి పోతే మరొకటి ఏదొ ఒక రకంగా కాంట్రవర్సీ బన్నీని, బన్నీ టీమ్ ను, పుష్ప2 ను వెంటాడుతూనే ఉన్నాయి. అల్లుఅర్జున ప్రెస్ మీట్ తరువాత పరిస్థితి ఇంకాస్త ముదిరింది అనుకోవచ్చు. అయితే ఇది ఇలా ఉంటే.. ఈ ఇష్యూలో కొత్త కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మరణం, అల్లు అర్జున్ నిర్లక్ష్యం, జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత సెలబ్రిటీల పలకరింపులు.. ఇలా చాలా విషయాలు అల్లు అర్జున్ కు మైనస్ గా మారాయి.
Also Read: మళ్లీ బుక్కైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న
అయితే ఇవి జరుగుతండగానే ఇంకొన్ని వివాదాలు పుష్ప2 నుచుట్టు ముడుతున్నాయి. ఈ కాంట్రవర్సీల విషయంలో పడి.. సినిమాలోంచి తప్పులను బయటు తీయ్యడం మర్చిపోయినట్టున్నారు నెటిజన్లు.. ఇక ఈ విషయంలో కాస్త ముందడుగు వేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. పుష్ప2 లో సుకుమార్ చేసిన పెద్ద తప్పు ఇదే.. అంటూ అతనిపై బూతులతో రెచ్చిపోయాడు. ఇష్టం వచ్చినట్టు తిట్టాడు.
Fahadh Faasil
ఇంతకీ పాపం సుకుమార్ చేసిన పెద్ద తప్పు ఏంటి..? తీన్ మార్ మల్లన్న తిట్టడానికి కారణం ఏంటి..? అసలు విషయానికి వస్తే.. పుష్ప2 లో కథ కంటే కూడా అల్లు అర్జున్ ఎలివేషన్ కే ఇంపార్టెంట్ ఇచ్చారు. బన్నీ కనిపించిన ప్రతీ సీన్ ఎలివేషన్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఫ్యాన్స్ తో ఉత్సాహం ఉరకలు వేసేలా సినిమా చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం స్మగ్లర్ గా ఉన్న పుష్పరాజ్ ను పట్టుకోవడం కోసం ఐపీఎస్ ఆఫీసర్ అయిన బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించారు.
teenmaar mallanna
అయితే ఓ సందర్భంలో ఐపీఎస్ ఆఫీసర్ ను స్విమ్మింగ్ ఫూల్ లోకి తోసి.. అందులో అల్లు అర్జున్ టాయిలెట్ పోస్తాడు. ఈసీజన్ రాగానే థియేటర్ లో అరుపులు విజిల్స్ తో దద్దరిల్లిపోయింది. అయితే ఈ సీన్ లో ఐపీఎస్ ఆఫీసర్ ను ఘోరంగా అవమానించాడని, అసలు ఇలాంటి సీన్ ఎలా రాస్తావు అంటూ సుకుమార్ పై ఫైర్ అయ్యాడు మల్లన్న.
నీకు బుద్దుందా.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నావు, ఒక స్మగ్లర్ తో పోలీస్ ఆఫీసర్స్ ను అవమానించడం .. అది కూడా ఈరకంగా అవమానించడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ తీన్ మార్ మల్లన్న రెచ్చిపోయి సుకుమార్ ను బండ బూతులు తిట్టాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అంతే కాదు పోలీసులను అవమానించినందుకు సుకుమార్ సారి చెప్పడంతో పాటు.. ఆ సీన్ ను తొలగించాలి అంటూ డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అంతే కాదు ఈసినిమాపై పోలీస్ కంప్లైట్ కూడా ఇచ్చారు మల్లన్న.
ఇలా రకరకాల వివాదాలు పుష్ప2 చుట్టు చేరుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈరోజు ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారించారు. దాదాపు 3 గంటలకు పైగా విచారణ జరిగింది. ఈకేస్ లో భౌన్సర్ ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
Allu Arjun Arrest
అయితే పుష్ప 2 చుట్టు ఎన్ని వివాదాలు ఉన్నా.. సినిమా మాత్రం ఏమాత్రం ఆగడంలేదు.. బాక్సాఫీస్ ను షేక్ చేసిపడేస్తోంది. మరీ ముఖ్యంగా నార్త్ లో భయంకరంగా వసూలు చేస్తోంది పుష్ప2. బాలీవుడ్ నుంచి ఈ సినిమా నార్త్ కలెక్షన్స్ 600 కోట్లకు పైగానే ఉన్నాయి. ఈరేంజ్ లో సినిమా దూసుకుపోతున్నా.. భారీ సకెస్స్ అయినా కూడా అల్లు అర్జున్ ఈ సక్సస్ ను ఏంజాయ్ చేసే పరిస్థితి ఏకుండా అయిపోయింది.