పవన్‌ కళ్యాణ్‌ ని తప్పుదోవ పట్టించారు, అసలు జరిగింది ఇదే.. థియేటర్ల బంద్‌ వివాదంపై దిల్‌ రాజు క్లారిటీ

Published : May 26, 2025, 06:33 PM IST

థియేటర్ల బంద్‌ వివాదంపై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయిన నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. అసలు వివాదం ఎక్కడ ప్రారంభమైందో తెలిపారు. 

PREV
19
థియేటర్ల బంద్‌ వివాదంపై పవన్‌ సీరియస్‌తో కదిలిన నిర్మాతలు

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్‌ వివాదం రోజు రోజుకి మరింత వేడెక్కుతుంది. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌ కావడంతో ఒక్కో నిర్మాత ముందు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం నిర్మాత అల్లు అరవింద్‌ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను ఆ నలుగురులో లేను అని, తన వద్ద 15 థియేటర్లే ఉన్నాయని తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమా విడుదల పెట్టుకుని థియేటర్ల బంద్‌ నిర్ణయం తప్పే అని, అది దుస్సాహసమే అని ఆయన స్పష్టం చేశారు.

29
ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కి దిల్‌ రాజు ధన్యవాదాలు

తాజాగా తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌, నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడి తనవైపు నుంచి క్లారిటీ ఇచ్చారు. ముందుగా.. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తాము కట్టుపడి ఉన్నామని చెబుతూ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మంత్రికి ధన్యవాదాలు తెలిపారు దిల్‌రాజు. మంత్రి ప్రకటనను ఆయన స్వాగతించారు. 

అనంతరం అసలు ఈ థియేటర్ల బంద్‌ వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలిపారు. ఎగ్జిబిటర్లకు సమస్యలున్న మాట నిజమే అని, అందులో భాగంగానే ఏప్రిల్‌ 19న ఈస్ట్ గోదావరిలో అక్కడి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మీటింగ్‌ పెట్టుకున్నారని, ఆ తర్వాత ఏప్రిల్‌ 26న మరోసారి మీటింగ్‌ జరిగిందని తెలిపారు. అక్కడి మీటింగ్‌ ప్రభావం తెలంగాణ ఎగ్జిబిటర్లపై కూడా పడిందని, ఇక్కడి ఎగ్జిబిటర్లు కూడా ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని దిల్‌ రాజు తెలిపారు.

39
థియేటర్ల బంద్‌ వివాదం వెనుక జరిగిన స్టోరీ ఇదే

`మే 18న దీనిపై మరోసారి ఫిల్మ్ ఛాంబర్‌లో మీటింగ్ జరిగింది. ఎగ్జిబిటర్లు అంతా ఛాంబర్‌తో మాట్లాడారు. ఆ సందర్భంగా ఎగ్జిబిటర్లు ఫిల్మ్ ఛాంబర్‌కి ఒక లేఖ రాశారు. అందులో డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లతో మీటింగ్‌ ఏర్పాటు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు ఛాంబర్‌ని కోరారు. 

ఈ సమస్యలు పరిష్కారం కాని యెడల తాము జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌కి వెళ్లాలని అనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ అది పక్కన పెట్టి జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌ అనే యాంగిల్‌ లో మీడియాకి సమాచారం ఇచ్చారు. దీంతో మీడియాలో జూన్‌ ఒకటి నుంచి థియేటర్ల బంద్‌ అనే వార్త స్ప్రెడ్‌ అయి ఈ వివాదం స్టార్ట్ అయ్యింద`ని దిల్‌ రాజు వెల్లడించారు.

49
పవన్‌ కళ్యాణ్‌ని తప్పుదోవ పట్టించారు

ఇలా రాంగ్‌గా బయటకు వెళ్తున్న నేపథ్యంలో దీనిపై ఫిల్మ్ ఛాంబర్‌ స్పందించలేదు, అదే ఇక్కడ జరిగిన పెద్ద తప్పు. ఛాంబర్‌ స్పందించి వివరణ ఇచ్చి, జూన్‌ 1 నుంచి బంద్‌ అనేది నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కానీ అలా ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ వివాదం పెద్దదైందననారు దిల్‌ రాజు. ఇదే విషయం ఏపీ ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కి, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కి తప్పుగా చేరిందన్నారు.

59
`హరిహర వీరమల్లు` సినిమా మీదకు ఈ బంద్‌ని తీసుకెళ్లారు

థియేటర్ల బంద్‌ అనేది తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమై, తెలంగాణ వరకు వచ్చి, ఫిల్మ్ ఛాంబర్‌కి వెళ్లి, అట్నుంచి పవన్ కళ్యాణ్‌గారి సినిమా మీదకు వెళ్లిందన్నారు దిల్‌ రాజు. ఏప్రిల్‌లో ఈ చర్చలు జరిగినప్పుడు `హరిహర వీరమల్లు` సినిమా మే 9న విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో క్లారిటీ లేదు. 

ఆ సమయంలో ఎగ్జిబిటర్లు అనుకున్న చర్చ థియేటర్ల బంద్‌. అంతేకాని వాళ్లు నిజంగానే బంద్‌ చేయాలని నిర్ణయించుకోలేదు, తాను మే 18న జరిగిన మీటింగ్‌లో కూడా అదే విషయం చెప్పానని, థియేటర్ల బంద్‌ కి వెళ్లొద్దు, థియేటర్లని నడిపిస్తూనే సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పినట్టు వెల్లడించారు దిల్‌ రాజు.

69
పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఉండగా ఆ సాహసం చేస్తారా?

డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్‌లోనూ ఇదే విషయం చర్చకు వచ్చిందని, అప్పుడు కూడా బంద్‌ అనేదానికి వెళ్లొద్దని చెప్పినట్టు తెలిపారు. అంతేకాదు సినిమాల రిలీజ్‌లు ఉన్న నేపథ్యంలో దొరికిన థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఉండగా, థియేటర్ల బంద్‌ చేయడం కష్టమని, ఆ సాహసం ఎవరూ చేయరు స్పష్టం చేశారు దిల్‌రాజు

 గతంలో సినిమా షూటింగ్‌లు బంద్‌ చేశామని, ఏం సాధించలేదు, పైగా చాలా నష్టపోయాం. ఇప్పుడు థియేటర్లు బంద్‌ చేస్తే కూడా ఎగ్జిబిటర్లే నష్టపోతారు, అంతకు మించి ఏదీ జరగదని, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు దిల్‌ రాజు.

79
నేను ఆ నలుగురిలో లేను, నా వద్ద ఉన్న థియేటర్లు ఇవే

తన వద్ద ఉన్న థియేటర్లకు సంబంధించి దిల్‌ రాజు క్లారిటీ ఇస్తూ.. తాను ఆ నలుగురులో లేను అని స్పష్టం చేశారు. తెలంగాణలో మొత్తం 370 థియేటర్లు ఉంటే, తన వద్ద 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయని, అలాగే ఉత్తరాంధ్రలో మరో ఇరవై థియేటర్లు ఉన్నాయన్నారు. ఏషియన్‌, సురేష్‌ బాబు వాళ్ల వద్ద తెలంగాణలో మరో 90 థియేటర్లు ఉన్నాయన్నారు. 

ఇలా 120 థియేటర్లు తమ వద్ద ఉంటే ఇంకా 250 థియేటర్ల సింగిల్‌ ఓనర్ల వద్ద ఉన్నాయని, వాటిలో చాలా మంది ఎగ్జిబిటర్లు థియేటర్లు నడవక మూసేసుకోవాలనుకుంటున్నారని, వారిని తానే ఆపుతున్నట్టు వెల్లడించారు. ఇక్కడ ఎగ్జిబిటర్లకు సమస్యలున్నాయి, డిస్ట్రిబ్యూటర్లకి సమస్యలున్నాయి, నిర్మాతలకు కూడా ప్రాబ్లమ్‌ ఉంది. ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటేనే పరిష్కారం దొరుకుతుందన్నారు దిల్‌ రాజు.

89
ఎగ్జిబిటర్లు కోరుతున్నది ఇదే

ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో పర్సంటేజీ ప్రకారం థియేటర్లు నడిపిస్తున్నారని, కానీ మన వద్ద మాత్రమే రెంటల్‌కి నడుస్తున్నాయన్నారు. పెద్ద సినిమాలకు మొదటి వారం రెంటల్‌ ఇస్తున్నారని, రెండో వారం పర్సంటేజీ చేస్తున్నారని, దీని వల్ల ఎగ్జిబిటర్లకి నష్టం వస్తుందని, వారికి గిట్టుబాటు కావడం లేదని, దీంతో వారు మొదటి వారమే కాదు, ఆ తర్వాత కూడా రెంటల్‌లోనే ఇవ్వాలని, లేదంటే మొత్తం పర్సంటేజీ చేయాలని అడుగుతున్నట్టు తెలిపారు. ఇక్కడే అసలు సమస్య వస్తుందన్నారు దిల్‌ రాజు.

99
పవన్‌ కళ్యాణ్‌ కోప్పడితే పడతాం, ఆయన మా పెద్దన్న

పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ కావడంపై స్పందిస్తూ, గతంలో తాము చాలా ఇబ్బంది పడ్డామని, కానీ పవన్‌ కళ్యాణ్‌గారు అధికారంలోకి వచ్చాక అన్నీ చాలా ఈజీ అయ్యాయని, చాలా హెల్ప్ చేస్తున్నారని తెలిపారు. ఎవరు వెళ్లి ఏది అడిగినా ఇస్తున్నారని, ప్రభుత్వం వచ్చాక తమని ఆహ్వానిస్తే వెళ్లి కలిశామని ఆ సమయంలో ఆయన ఇండస్ట్రీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని తెలిపారు.

 కానీ ఆ తర్వాత ఛాంబర్‌ నుంచి సీఎంని వెళ్లి కలవలేదని, అదే ఆయన బాధ అని తెలిపారు. పైగా తన సినిమా విడుదల సమయంలో ఇలా చేస్తున్నారనేది ఆయనకు కోపం తెప్పించిందని, అందుకే తమపై సీరియస్‌ అయ్యారని, ఆయన మాకు పెద్దన్న అని,  పెద్దన్న కోప్పడితే పడతాం, తర్వాత వెళ్లి మాట్లాడుకుని సరి చేసుకుంటామని తెలిపారు దిల్‌రాజు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories