2000లో మిస్ వరల్డ్‌గా విజయం సాధించిన ప్రియాంక, 2002లో తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2003లో ‘ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'ఫ్యాషన్', 'డాన్', 'బర్ఫీ', ' మేరీ కోమ్' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.