పోస్టర్‌ కలెక్షన్లు తప్పే, ఐటీ రైడ్స్ పై దిల్‌ రాజు వివరణ.. అధికారులు షాక్‌ అయిన విషయం ఏంటంటే?

Published : Jan 25, 2025, 01:22 PM IST

స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజుపై గత నాలుగు రోజులుగా ఐటీ శాఖ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా దిల్‌ రాజు స్పందించి వివరణ ఇచ్చారు.   

PREV
14
పోస్టర్‌ కలెక్షన్లు తప్పే, ఐటీ రైడ్స్ పై దిల్‌ రాజు వివరణ.. అధికారులు షాక్‌ అయిన విషయం ఏంటంటే?

టాలీవుడ్‌పై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాల మేకర్స్, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు ఇల్లు, ఆఫీస్‌పై, అలాగే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌, ఫైనాన్షియర్‌ సత్య రంగయ్య, ఇలా చాలా మంది సినీ ప్రముఖులపై ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుంది. గత కొంత కాలంగా జరిగిన సినిమా లావాదేవీలపై ఈ రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. 

గత నాలుగైదు రోజులుగా ఈ ఐటీ దాడులు జరుగుతున్న విసయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా దిల్‌ రాజుకి సంబంధించిన అనేక విషయాలు బయటకు వచ్చాయి. బ్యాంక్‌ లాకర్లని కూడా ఓపెన్‌ చేశారని, ఇళ్లు, ఆఫీసులపై, బంధువుల ఇళ్లపై దాడులు జరిగాయని తెలుస్తుంది. అయితే దిల్‌ రాజుకి సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, చాలా డాక్యుమెంట్లకి లెక్కలు లేవని, సరైన లెక్కలు చూపించలేకపోయాడని రూమర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా దిల్‌ రాజు స్పందించారు. 

24

శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, తమపై తప్పుడు వార్తలను ప్రచారం చేయోద్దన్నారు. తమ నివాసంలో, ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలిపారు. తమ వద్ద డాక్యుమెంట్లు, డబ్బు దొరికినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ 20లక్షల లోపు మాత్రమే డబ్బు దొరికింది.

అన్ని రకాల డాక్యుమెంట్స్ చెక్‌ చేశారు. 24 క్రాఫ్ట్ లకు సంబంధించిన లావాదేవీల చెక్‌ చేశారు. ఐదేళ్లుగా మేం ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదు. ఫైనల్‌గా నా లావాదేవీలు చూసి అధికారులే షాక్‌ అయ్యారు. అంతా క్లీన్‌గా ఉందన్నారు. నా వద్ద ఏదో ఉంటుందని భావించారట, కానీ ఇంత క్లీన్‌గా ఉండటంతో వాళ్లే ఆశ్చర్యపోయారు. 

read more: రాజమౌళి క్లీయర్‌గా చెప్పేశాడు, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రియాంక చోప్రానే

34
Dil Raju

నన్నే టార్గెట్‌ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాంటిదేమీ లేదు. ఇండస్ట్రీలో అందరిపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. చివరగా 2008లో జరిగాయి. మళ్లీ ఇప్పుడు అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్‌. ఏ కంపెనీలో అయినా ఇలాంటి రైడ్స్ జరుగుతుంటాయి. ఇదంతా ఒక ప్రాసెస్‌. ఇందులో ఎలాంటి హడావుడి లేదు.

also read; `గేమ్‌ ఛేంజర్‌` ఫెయిల్యూర్‌పై ఆర్జీవీ జెన్యూన్‌ రివ్యూ.. శంకర్ ఇంత చిన్న లాజిక్‌ ఎలా మిస్ అయ్యాడు?

ఇప్పుడు సినిమాల కలెక్షన్లకి సంబంధించిన బుకింగ్స్ అన్నీ ఆన్‌లైన్‌లో అవుతున్నాయి. అంతా క్లీన్‌గానే ఉంటుంది. ఈ రైడ్స్ కి సంబంధించి మళ్లీ ఫిబ్రవరి 3న వచ్చి కలవాలని చెప్పారు, అప్పుడు మా ఆడిటర్‌ వెళ్లి కలుస్తాడు` అని తెలిపారు దిల్‌ రాజు. 

ఇక సినిమా పోస్టర్లపై ఎక్కువ కలెక్షన్లు చూపడంపై స్పందిస్తూ దీనిపై ఇండస్ట్రీలో అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. నేను ఒక్కడినే మాట్లాడటం సరికాదు. అందరం చర్చించించుకోవాల్సిన విషయం, కలెక్షన్లని ఎక్కువగా చూపించడం తప్పే అని అన్నారు

44
dil raju it raid

దిల్‌రాజు. ఇక తన అమ్మకి ఆసుపత్రిలో చేర్పించడంపై చెబుతూ, ఆమెకి లంగ్స్ ఇన్‌ఫ్లెక్షన్‌ అయ్యిందని, చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనిపై ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దు అని దిల్‌ రాజు  వెల్లడించారు.  

దిల్‌ రాజు ఇటీవల రామ్‌ చరణ్‌ హీరోగా `గేమ్‌ ఛేంజర్‌` చిత్రాన్ని నిర్మించారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఇది భారీగా నష్టాలను తీసుకొస్తుందని తెలుస్తుంది. అయితే పోస్టర్‌ కలెక్షన్ల విషయంలో ట్రోల్స్ కి గురయ్యారు.

అదే సమయంలో ఈ మూవీని ఇతర హీరోల అభిమానులు నెగటివ్‌ ప్రచారం చేసి చంపేశారు. ట్రోల్స్ తో దారుణమైన నెగటివ్‌ ప్రచారం చేశారు. అంతేకాదు ఈ సంక్రాంతికే ఆయన నిర్మించిన మరో సినిమా `సంక్రాంతికి వస్తున్నాం` విడుదలైంది. భారీ వసూళ్లని రాబడుతుంది. ఇది ఇప్పటికే రూ. 230కోట్లు దాటింది. భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది. 

read  more: జాన్వీ కపూర్‌ ముగ్గురు పిల్లల ఫాంటసీ, భర్తకి ఆయిల్‌ మసాజ్‌ చేస్తూ గోవింద నామస్మరణం

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories