రష్మిక చేసిన డాన్స్ సీక్వెన్స్ తొలిగించమంటూ వివాదం

Published : Jan 25, 2025, 12:14 PM IST

రష్మిక మందన్న, విక్కీ కౌశల్ నటించిన 'చావా' సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లోని ఓ డాన్స్ సీక్వెన్స్‌పై విమర్శలు వస్తున్నాయి. చారిత్రక సినిమా కావడంతో కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

PREV
16
 రష్మిక చేసిన డాన్స్ సీక్వెన్స్ తొలిగించమంటూ వివాదం
Rashmika Mandanna

రష్మిక మంధాన లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో చావా అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ-సాయిబాయి దంపతుల పెద్ద కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజు జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ ట్రైలర్ లో చూపించిన విక్కీ కౌశిల్, రష్మికల డాన్స్ ని ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. కొందరైతే ఆ డాన్స్ సీక్వెన్స్ తీసేయమని అడుగుతున్నారు. 

26

ఈ చిత్రం లో చూపించిన సన్నివేశాల్లో  ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి విడుదలకు ముందు చరిత్రకారులకు తప్పక చూపించాలని రాజ్యసభ మాజీ ఎంపీ శంభాజీరాజే ఛత్రపతి శుక్రవారం (జనవరి 25) అన్నారు. అదే సమయంలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ , మహారాణి యేసుబాయి పాత్రలను పోషించిన నటులు విక్కీ కౌశల్ ,  రష్మిక మందన్న మధ్య చిత్రీకరించిన  డ్యాన్స్ సీక్వెన్స్‌పై  మరాఠాకు చెందిన కొన్ని  వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.   దాంతో  ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, మాజీ ఎంపీ  ఇలా కామెంట్ చేయాల్సి వచ్చింది. 

36


ఈ వారం మొదట్లో  విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లో, మహారాష్ట్ర సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉన్న సాంప్రదాయ సంగీత వాయిద్యం 'లెజిమ్'తో కౌశల్ మరియు మందన్న నృత్యం చేస్తున్న సీక్వెన్స్ ఉంది. ఆ పాటే ఇప్పుడు విమర్శల పాలవుతోంది. 
 

46
Vicky kaushal movie Chhaava Trailer, Rashmika Mandanna


ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం , ఆయన  శౌర్యవంతమైన పాలనను ఈ చిత్రం హైలైట్ చేయడం అభినందనీయం. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మరియు అతని టీమ్ నాకు సినిమా ట్రైలర్‌ను చూపించారు. నేను సినిమా మొత్తం విడుదలకు ముందే చూడాలనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఏమైనా చారిత్రక సమస్యలు ఉన్నా వాటిని చరిత్ర కారులతో కూర్చుని  వాటిని కనెక్ట్ చేయడానికి కూడా ముందుకొచ్చాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ ముఖ్యమైన కథను ప్రామాణికంగా అందించాలనేదే నా ఆలోచన" అని శంభాజీరాజే ఛత్రపతి అన్నారు.
 

56


రష్మిక మందన్న హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. హిందీ నిర్మాతలు రష్మిక కాల్షీట్ కోసం రేసులో ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ విక్కీ కౌశల్‌తో ‘చావా’ సినిమా చేసింది. ఈ మూవీలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ పోషించాడు. శంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక కనిపించనుంది.

ఈ సినిమా గురించి రష్మిక .. సౌత్ నుంచి వచ్చి మహారాణి యేసుబాయి పాత్రలో నటించాను. ఇది నా జీవితంలో నేను చేసిన ప్రత్యేక పాత్ర. ఈ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనిపించిందని దర్శకుడు లక్ష్మణ్‌తో చెప్పాను’ అని రష్మిక తెలిపింది. చావా ట్రైలర్ నన్ను ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ దేవుడిలా కనిపిస్తున్నాడు అని తెలిపింది రష్మిక సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నకు డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

66


 రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగులో పుష్ప 2 సినిమాతో భారీ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా రూ. 18 వందలకోట్లకు పైగా వసూల్ చేసి సత్తా చాటుతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ రాణిస్తుంది. తాజాగా రష్మిక రిటైర్మెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇది విని చాలా మంది షాక్ అవుతున్నారు.  
 

click me!

Recommended Stories