Gunde Ninda Gudi Gantalu: అత్త ప్రభావతి చేసిన కుట్రతో బాలు వద్ద అడ్డంగా దొరికిపోయినా మీనా

Published : Jan 15, 2026, 09:42 AM IST

తమ్ముడి పుట్టిన రోజుని గుడికి వెళ్లిన మీనాని ఆమె భర్త బాలు వద్ద గట్టిగా ఇరికించింది అత్త ప్రభావతి. మీనాని తన కొడుకు నుంచి దూరం చేసేందుకు ఇంతటి కుట్రని చేస్తుంది. 

PREV
18
మీనా తమ్ముడు శివ పుట్టిన రోజుకి ప్రసాదాల ఏర్పాటు

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ నేడు గురువారం(జనవరి 15) ఎపిసోడ్‌లో మీనా అమ్మగారు ఫ్యామిలీ గుడికి వస్తారు. మీనా తమ్ముడు శివ పుట్టిన రోజు నేడు. గుళ్లో అర్చన చేయించి భక్తులకు ప్రసాదాలు పంచాలని ప్లాన్‌ చేస్తారు. అయితే మీనా వచ్చాక ఆమె చేతులతోనే ఈ ప్రసాదాల పంపకం చేయాలని భావిస్తుంది వాళ్ల అమ్మ పార్వతి. కానీ ఇంకా మీనా రాకపోవడంతో శివ బాధపడుతుంటాడు. కోప్పడుతుంటాడు. ఆమె రాదు, ఆయన రానివ్వడు అంటూ ఆవేశానికి గురవుతుంటాడు. తప్పు అలా అనకూడదు, ఆయన మీ బావ అని వాళ్ల అమ్మ చెబుతుంది.

28
బాలు వెళ్లొద్దన్న విషయం చెప్పిన మీనా

మీనా ఇంకా రాకపోవడంతోవాళ్లమ్మ పార్వతి కాల్‌ చేస్తుంది. తాను కచ్చితంగా రావాలా? అని అడుగ్గా, నీ కోసం తమ్ముడు వెయిట్‌ చేస్తున్నాడని చెబుతుంది. ఈ సందర్భంగా బాలు రావద్దన్న విషయం అమ్మకి చెబుతుంది మీనా. ఇంతలో శివ ఫోన్‌ ఇస్తుంది. `మీ ఆయన రావద్దంటున్నాడా, నువ్వు వస్తేనే నేను ఉంటా, లేకపోతే వెళ్తా. నా కోసం ఎవరు ఆపిన ఆగొద్దు` అని శివ కాల్ కట్ చేస్తాడు. అంతలోనే శ్రుతి రావడంతో శివ పుట్టినరోజు, గుడిలోప్రసాదాలు పంచిపెట్టడం గురించి, బాలు వద్దనడం గురించి చెబుతుంది మీనా.

38
మీనాని బాలు వద్ద ఇరికించేందుకు ప్రభావతి ప్లాన్‌

నీ పుట్టింటికి వెళ్లడానికి బాలు పర్మిషన్ కావాలా. పుట్టింటి వాళ్లను బాధపెట్టడం ఇష్టం లేదనుకుంటే వెళ్లు అని శ్రుతి అంటుంది. దాంతో మీనా వెళ్లడానికి రెడీ అవుతుంది. అదంతా చూసిన ప్రభావతి వాడి మాట కాదని ఇది వెళ్తుంది. నగలు దొరికినప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు నాకు మంచి భోజనం దొరికింది ఆహా అని ప్రభావతి సంబరపడుతుంది. బాలు వద్ద మీనాని ఇరికించడానికి ఇది సరైన సమయం అని మనసులో ఖుషీ అవుతుంది.

48
తమ్ముడిని హ్యాపీ చేసిన మీనా

మీనా మొత్తానికి గుడికి వెళ్తుంది. అక్కని చూసి శివ ఎమోషనల్ అవుతాడు. గొప్ప స్థాయిలో ఉండాలని శివకి బర్త్ డే విషెస్ చెబుతుంది మీనా. మీనా దిగులును చూసి ఏమైందని అడగ్గా, బాలుకు చెప్పకుండా వచ్చానని చెబుతుంది మీనా. ఏదైనా గొడవ అవుతుందేమో అని పార్వతి అంటే.. అది నేను చూసుకుంటాను. ముందు శివ పేరు మీద అర్చన చేపిద్దామని మీనా అంటుంది.

58
మీనాని బాలు వద్ద ఇరికించిన ప్రభావతి

మరోవైపు అప్పుడే ఇంటికి వచ్చిన బాలు.. మీనా మీనా అని పిలుస్తుంటాడు. ఇంట్లో లేదని ప్రభావతి చెబుతుంది. మీనాకు బాలు కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. మీనా తమ్ముడి పుట్టినరోజు జరుపుకోడానికి గుడికి వెళ్లింది కదా అని ప్రభావతి నిజం చెబుతుంది. సందు దొరికితే చాలు నిందలు వేస్తావు. తను నా మాట జవదాటదు అని బాలు అంటాడు. నీ చెవిలో పూలు పెట్టి వెళ్లిందిరా. నేను నా కళ్లతో చూశాను, కావాలంటే గుడికి వెళ్లి చూడు తెలుస్తుందిగా అని ప్రభావతి బాలుకి చెబుతుంది. మొత్తానికి మీనాని బాలు వద్ద గట్టిగా ఇరికించింది ప్రభావతి.

68
గుడిలో మీనాకి షాక్‌ ఇచ్చిన బాలు

ఇటు వైపు గుడిలో మీనా ప్రసాదాలు పంచి పెట్టి, మధ్యలోనే నేను వెళ్లిపోతానని చెబుతుంది. ఆయనకు చెప్పకుండా వచ్చాను పద్ధతి కాదని టెన్షన్‌ పడుతుంది మీనా. ఇంతలో బాలు వస్తాడు. మీనాను ఇంకొంచెం సేపు ఉండమని పార్వతి అంటుంది. మీనా ప్రసాదాలు పంచి పెడుతుంది. ఆ ప్రసాదాన్ని తీసుకునేందుకు బాలు చేయి చాపుతాడు. బాలును చూసి మీనా షాక్ అవుతాడు. నా పేరు బాలు అని ఎటకారంగా అంటాడు. ఇవాళ శివ పుట్టినరోజు అని మీనా అంటుంది. అంటే నేను పోయిన రోజా అని బాలు అంటాడు. ఏంటండి ఆ మాటలు అని మీనా అంటే.. హో నా మాట పోయిన రోజా అని బాలు అంటాడు. నేను ప్రసాదం కోసం రాలేదు. నిజం తెలుసుకునేందుకు వచ్చాను. నేను ఎంత చేసిన మీరు మీరు ఒకటి. భర్త మాట కంటే రౌడీల తిరిగే తమ్ముడు ఎక్కువైనందుకు సంతోషంగా ఉందని బాలు అంటాడు.

78
తాను చేసిన కుట్రని మీనాకి చెప్పిన ప్రభావతి

ఉండు ఇక్కడే సంతోషంగా ఉండు. నేను వద్దన్న వచ్చిందిగా అని బాలు కోపంగా వెళ్లిపోతాడు. తర్వాత శివ పుట్టినరోజు అని సత్యంకు ప్రసాదం ఇస్తుంది. ప్రభావతికి ఇస్తే మీరు ఏది పెట్టిన నాకు విషంతో సమానం. దాంట్లో మీరు ఏం కలిపారో ఏం తెలుసు అని అంటుంది. బాలు గాడు గుడికి వచ్చినట్లు ఆయనతో చెబుతున్నావ్. మరి అక్కడ ఏం జరిగిందో చెప్పలేదు. నువ్వు గుడికి వెళ్లిన విషయం చెప్పింది నేనే. కానీ, వాడు నమ్మలేదు. పిచ్చి భ్రమలో ఉన్నావని నేనే పంపించాను అని ప్రభావతి చెబుతుంది. ఇదంతా చేసింది మీరా అని ఎమోషనల్‌గా అంటుంది మీనా. ఇదే కాదు. నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోయేదాకా నేను ఇలాగే చేస్తుంటాను. లెక్కపెట్టుకో. రోజులు లెక్కపెట్టుకో. నువ్వు తొందర్లోనే ఇంట్లోంచి వెళ్లిపోబోతున్నావ్ అని ప్రభావతి అంటుంది. దానికి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్రుతి వచ్చి బాలు గొడవ చేశాడా అని అడిగితే లేదని అబద్ధం చెబుతుంది మీనా. ఇప్పుడు ఆయన వచ్చి ఎంత రాద్ధాంతం చేస్తాడో అని మీనా అనుకుంటుంది.

88
బాలు విషయంలో మీనా ఆవేదన

 రాత్రి బాలు తాగి వస్తాడు. మగాన్ని భార్య కాదు బారు అర్థం చేసుకుంటుంది అని బాలు అంటాడు. మీరు ఇలా తాగితే భార్యగా నాకు ఎలా ఉంటుంది అని మీనా అంటుంది. భార్య అంటే పుట్టింట్లో భర్త గౌరవం పోగొట్టేది కాదు. అయినా నీకు నేను ఏమవుతాను. నువ్వు దాటెళ్లింది గడపను కాదు నా గుండెను అని బాలు అంటాడు. ఒక ఆడదానికి పెళ్లి అయితే పుట్టిల్లు మర్చిపోవాలా అని మీనా అంటుంది. ఇన్నాళ్లు నీకోసమే ఆలోచించాను. నీ నాట మీద తాగలేదు. ఇకనుంచి నేను తాగుతూనే ఉంటాను అని బాలు అంటాడు. మొత్తానికి కొడుకు, కోడలి మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటుంది ప్రభావతి. ఈ డ్రామా అంతా ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. మొత్తానికి ఇలా గురువారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగిసింది. మరి రేపు మీనా, బాలు మధ్య ఏం జరుగుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories