Prabhas: ప్రభాస్, అనుష్క మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఇక ప్రభాస్ సినిమాల్లో.. అనుష్కకు ఏది ఫేవరెట్ అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారింది అనుష్క శెట్టి. 'సూపర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని స్టార్ డమ్ అందుకుంది. అరుంధతి సినిమా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.
25
ప్రభాస్‌తో వరుస సినిమాలు..
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించిన అనుష్క.. ప్రభాస్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు చాలామంది ఉన్నారు. సూపర్ హిట్ చిత్రాలను సైతం అందించారు.
35
కామెంట్స్ వైరల్..
ఇక గతంలో అనుష్క ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టమో చెప్పేసింది. తనకు బిల్లా మూవీ అంటే ఇష్టమని చెప్పింది. బిల్లా సినిమాలో అనుష్క స్టైలిష్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అనుష్క పాత్రకు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువే.
ప్రభాస్, అనుష్క కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి 1', 'బాహుబలి 2' ఎంత పెద్ద హిట్ అయ్యయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరే సినిమా రాలేదు. అయితే మరో సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
55
ది రాజాసాబ్ సక్సెస్..
ప్రభాస్, మారుతి కాంబోలో వచ్చిన చిత్రం 'ది రాజా సాబ్'. సంక్రాంతి కానుక విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హారర్-ఫాంటసీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కగా.. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.