యష్మిని నిఖిల్‌ వాడుకున్నాడా? ఆవేశంలో నోరు జారిన గౌతమ్‌.. నామినేషన్‌లో బిగ్‌బాస్‌ ట్విస్ట్

First Published | Dec 2, 2024, 11:47 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8.. 14వ వారం నామినేషన్‌లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో యష్మి, నిఖిల్‌లపై గౌతమ్‌ చేసిన కామెంట్‌ సంచలనంగా మారాయి. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ 14వ వారం సోమవారం ఎపిసోడ్‌లో.. నామినేషన్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. నామినేషన్‌కి సంబంధించి ఇది చివరి వారం అనే విషయం తెలిసిందే. దీంతో ఈ వారం ఫైనలిస్ట్ కి వెళ్లిన అవినాష్‌ తప్ప అందరు నేరుగా ఆడియెన్స్ చేత నామినేట్‌ అవుతారని తెలిపారు బిగ్‌ బాస్‌. దీంతో నిఖిల్‌, గౌతమ్‌, ప్రేరణ, విష్ణు ప్రియా, నబీల్‌, రోహిణి నామినేట్‌ అయ్యారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అయితే ఈ నామినేషన్‌లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. నామినేషన్ల నుంచి సేవ్‌ అయ్యే అవకాశాన్ని కల్పించాడు. అదే సమయంలో నామినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యే ఒకరు సెకండ్‌ ఫైనలిస్ట్ అవుతారని తెలిపారు. ఇందులో ఎవరు నామినేషన్‌ ఉండకూడదు అనే విషయంలో అవినాష్‌.. విష్ణు ప్రియాని అర్హురాలు కాదన్నాడు.

ఆమె పలుమార్లు తనకు ఈ షో సెట్‌ కాదని చెప్పిందన్నారు. ఆ తర్వాత విష్ణు ప్రియా.. గౌతమ్ పేరు చెప్పింది. ఆయన తనతో ఫ్రీగా లేడని, ఆయనేంటో అర్థం కావడం లేదని తెలిపింది. ఈ విషయంలో విష్ణు ప్రియా పక్షపాతంగా వ్యవహరించిందని గౌతమ్‌ తెలిపారు. 
 

Latest Videos


గౌతమ్‌.. నిఖిల్‌ పేరు చెప్పాడు. తనని రాంగ్‌గా పోట్రే చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. మాటల్లో ప్రేరణని ఆడుకున్నావని గౌతమ్‌ని నిఖిల్‌ అన్నాడు. దీంతో రెచ్చిపోయిన గౌతమ్‌ నువ్వు యష్మిని వాడుకున్నావంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దెబ్బకి విష్ణు ప్రియా షాక్‌ అయ్యింది.

గౌతమ్‌ వాడిన పదం రాంగ్‌గా వెళ్లింది. నిఖిల్‌ కూడా తనని వాడుకున్నావ్‌ అన్నాడనుకుని తాను యష్మిని వాడుకున్నావ్‌ అని అన్నట్టు గౌతమ్‌ తెలిపారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. నీ గేమ్‌ స్క్రీన్‌ ప్లే అన్నీ తనకు తెలుసు అంటూ నిఖిల్‌ కూడా రెచ్చగొట్టేలా మాట్లాడారు. వీరి ఆర్గ్యూమెంట్‌ పీక్‌లోకి వెళ్లింది. 
 

గౌతమ్‌ తప్పులకు సంబంధించిన విషయాలు నాక్కూడా తెలుసు అని నిఖిల్‌ అన్నాడు. అయితే ఇప్పుడు చెప్పాలని గౌతమ్‌ ఫోర్స్ చేయగా, నాకిప్పుడు మూడ్‌ లేదని నిఖిల్‌ అనడంతో, మూడ్‌ లేకపోతే మూసుకుని కూర్చో అని గౌతమ్‌ అనడంతో మాటలు జాగ్రత్త అంటూ నిఖిల్‌ ఫైర్‌అయ్యారు.

దీన్ని విష్ణు ప్రియా, రోహిణి, అవినాష్‌ కూడా వ్యతిరేకించారు. దీంతో వెంటన సారీ చెప్పాడు గౌతమ్‌. అయితే ఈ సారీని నాకు వద్దు అని ఆయన చెప్పడం విశేషం. ఇక నిఖిల్‌.. రోహిణి పేరు చెప్పారు. 
 

నామినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యే ప్రక్రియలో చివరగా నబీల్‌, ప్రేరణ మిగిలారు. వీరిలో ఒక్కరికే సేవ్‌ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. నామినేషన్‌ నుంచి సేవ్‌ కావాలంటే కొంత అమౌంట్‌ ప్రైజ్‌ మనీ నుంచి కట్ అవుతుందని, ఎంత అనేది ఆయా కంటెస్టెంట్లు లెటర్‌లో రాసినదాన్ని బట్టి ఉంటుందన్నారు.

అయితే ప్రైజ్‌ మనీ కట్‌ చేసి సేవ్‌ కావడమనేదాన్ని ఇతర కంటెస్టెంట్లు వ్యతిరేకించారు. అలా చేయోద్దని, ఇద్దరూ నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారని చెప్పారు. దీంతో ఆడియెన్స్ ఓటింగ్‌ ద్వారా ఇంత దూరం వచ్చామని, వారి ఓటింగ్‌తోనే ఫైనల్‌కి వెళ్తామని, నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతామనే నమ్మకం ఉందని చెప్పారు. తాము రాసిన లెటర్స్ కట్‌ చేశారు.

దీంతో ఈ వారం నామినేషన్‌లో ముందు చెప్పినట్టు అవినాష్‌ తప్ప అందరు నిఖిల్‌, గౌతమ్‌, నబీల్‌, ప్రేరణ, విష్ణు ప్రియా, రోహిణి ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది తెలియాల్సి  ఉంది.  

read more: శోభన్‌ బాబుని కొట్టిన నిర్మాత ఎవరో తెలుసా? అప్పట్లో సంచలనం.. చేతులు పైకెత్తాడని అంతగా రెచ్చిపోయాడా?

also read: మహేష్‌ బాబు సినిమా వెయ్యి కోట్లు కాదు, అసలు బడ్టెట్‌ తెలిస్తే మైండ్‌ బ్లాకే.. రాజమౌళి ధైర్యం ఇదే?
 

click me!