పుష్ప 2 ఇంట్రో సీన్ చూశాను, ఆల్ ది బెస్ట్ నేను చెప్పను. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి!

First Published | Dec 2, 2024, 10:43 PM IST

పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా వచ్చిన రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను పుష్ప 2 చిత్రంలో ఇంట్రో చూశాను. ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పను అన్నారు. 
 

Allu Arjun, #Pushpa2, sukumar

పుష్ప 2 విడుదలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అల్లు అర్జున్, సుకుమార్, శ్రీలీల, రష్మిక మందాన, అనసూయ, చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. 

రాజమౌళితో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. రాజమౌళి అర్జెంటుగా వెళ్లాల్సి ఉండగా... ఆయన ముందుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప 2 ఇంట్రో సీన్ చూశానని, ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పను, అనడం ఒకింత ఆసక్తి రేపింది. 
 


Pushpa 2 pre release event

రాజమౌళి మాట్లాడుతూ... పుష్ప పార్ట్ వన్ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ కి నేను ఒకటే చెప్పాను. నీ కోసం నార్త్ ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. అక్కడ పుష్ప ను ప్రమోట్ చేయమన్నాను. ఈ సినిమాకు ప్రమోషన్ అవసరం లేదు. ఆల్రెడీ దేశంలో చాలా మంది పుష్ప టికెట్స్ కొనేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగువాళ్లు ఉన్నా.. ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారు. 

మనం ఒక మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కి వస్తే .. మన మాటల వలన ఆ సినిమాకు కొంత ప్రచారం దక్కాలి. మేలు జరగాలి. కానీ పుష్ప 2కి అది అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఒకరోజు నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాను. అక్కడ పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. దాంతో బన్నీ, సుకుమార్ లను కలిసేందుకు సెట్స్ కి వెళ్లాను. నాకు జస్ట్ ఇంట్రో చూపించారు. 

Rajamouli

ఆ సీన్ చూశాక దేవిశ్రీ బీజీఎం ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వొచ్చు. ఆ రేంజ్ లో ఉంది. మరి ఇంట్రోనే అలా ఉంటే.. ఇక మూవీ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పను. ఎందుకంటే ఆల్ రెడీ మూవీ కుమ్మేస్తుంది. సినిమా అద్భుతంగా ఉంటుంది అది ఈ ప్రపంచానికి డిసెంబర్ 5న తెలుస్తుంది. ఐదున కూడా కాదు. 4వ తేదీ అర్ధరాత్రి నుంచే జాతర మొదలవుతుంది, అన్నాడు. 

రాజమౌళి కామెంట్స్ ఫ్యాన్స్ ని మరింత ఉత్కంఠకు గురి చేశాయి. అంచనాలు పెంచేశాయి. దాదాపు పుష్ప విడుదలైన మూడేళ్లకు సీక్వెల్ వస్తుంది. భారీ బడ్జెట్ తో మూవీ తెరకెక్కించారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 1000 కోట్లు అని సమాచారం. ఓటీటీ రైట్స్ ద్వారానే రూ. 270 కోట్లు వచ్చాయట. రూ. 600 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ ఈ చిత్రం చేసింది. అల్లు అర్జున్ రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. 

Latest Videos

click me!