నా ముఖం 'మగధీర' ముందు వెలిగిపోయింది..ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 కి, అల్లు అరవింద్ భలే కవర్ చేశారే

First Published | Dec 2, 2024, 10:33 PM IST

పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ వేడుకకి రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఇతర చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు.

పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ వేడుకకి రాజమౌళి అతిథిగా హాజరయ్యారు. అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఇతర చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. అదే విధంగా అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ కూడా సందడి చేశారు. 

అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారం ముందే పుష్ప 2 చిత్రం తాను చూడడం జరిగింది అని చెప్పారు. సినిమా అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ ని హుషారెత్తించారు. పుష్ప 2 చూసి నేరుగా ఇంటికి వెళ్ళాను. మా సతీమణి చూసి ఏంటి మీ ముఖం వెలిగిపోతోంది అని అడిగింది. పుష్ప 2 చూసి వస్తున్నా అని నా సంతోషాన్ని పంచుకున్నా. వెంటనే ఆవిడ ఒక మాట అంది.. మీ ముఖం ఇంతలా వెలిగిపోవడం రెండుసార్లే చూశాను. 


మగధీర రిలీజ్ ముందు ఇదే విధంగా మీ ముఖం వెలిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంతలా వెలుగుతోంది అని చెప్పింది అంటూ ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. మెగా అల్లు మధ్య చాలా వివాదాలు ఉన్నాయి అంటూ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్ ఒక రేంజ్ ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు.  మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య అంతా కూల్ అని అల్లు అరవింద్ సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు. 

అల్లు అర్జున్ భార్య స్నేహ, సుకుమార్ భార్య భబితకు నా వార్డులు అన్నీ ఇచ్చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇంతగా సపోర్ట్ చేసినందుకు. అలాగే ఈ సినిమాలో నేను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడాలి. ఎంత బాగా నటించింది అంటే పుష్ప 1 సినిమాలో ఆమె నటన ఈ సినిమాతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. 

అలాగే దేవిశ్రీ ప్రసాద్ నాకు తన చిన్నతనం నుండి తెలుసు. తన తండ్రి నా స్నేహితుడు. తను ఇంత మంచి హిట్స్ కొట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఒక నిర్మాతగా నేను చెప్తున్నాను మైత్రి మూవీ మేకర్స్ దేశంలోనే అతిపెద్ద నిర్మాతలు. వారు ఇన్ని సినిమాలు ఇంత పర్ఫెక్ట్ గా ఎక్కడ ఒక కంప్లైంట్ కూడా లేకుండా ఎలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందరికీ ఆల్ ద బెస్ట్" అంటూ ముగించారు.

Latest Videos

click me!