Take That (డాక్యుమెంటరీ సిరీస్)
బ్రిటన్‌కు చెందిన లెజెండరీ బాయ్ బ్యాండ్ Take That ప్రయాణాన్ని ఈ మూడు భాగాల డాక్యుమెంటరీలో చూపించారు. గత 35 ఏళ్లలో వారి విజయాలు, విభేదాలు, పునఃసంఘటన—all unseen footageతో ఈ సిరీస్ రూపొందింది. గ్యారీ బార్లో, మార్క్ ఓవెన్, హోవర్డ్ డొనాల్డ్ కొత్త ఇంటర్వ్యూలలో పాల్గొనగా, రాబీ విలియమ్స్, జేసన్ ఆరెంజ్ ఆర్కైవ్ ఫుటేజ్ ద్వారా కనిపిస్తారు. 90ల మ్యూజిక్ లవర్స్‌కు ఇది నాస్టాల్జిక్ ట్రీట్.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జనవరి 27
Bridgerton – Season 4 (Part 1)
ఈ సీజన్‌లో ప్రధానంగా బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్ ప్రేమకథను చూపించనున్నారు. మాస్కరేడ్ బాల్‌లో అతడు కలుసుకునే రహస్య మహిళ సోఫీ బేక్ కథ ఈ సీజన్‌కు ప్రధాన ఆకర్షణ. ఫాంటసీ vs రియాలిటీ అనే థీమ్‌తో రూపొందిన ఈ సీజన్ రెండు భాగాలుగా విడుదలవుతుంది. రొమాన్స్, డ్రామా అభిమానులకు తప్పనిసరిగా చూడాల్సిన సిరీస్.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జనవరి 29
Dhurandhar
అండర్‌కవర్ RAW ఏజెంట్‌గా రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్, నిజ జీవిత యాంటీ-టెర్రర్ ఆపరేషన్ల ఆధారంగా రూపొందింది. IC-814 హైజాక్, పార్లమెంట్ దాడి, ముంబై 26/11 వంటి ఘటనల నేపథ్యంతో కథ సాగుతుంది. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇప్పుడు OTTలోకి వస్తోంది.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జనవరి 30
ఛాంపియన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ఈ మూవీ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది ఈ చిత్రం.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జనవరి 29