రామ్ చరణ్ `పెద్ది` తర్వాత ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇందులో రూ.3200కోట్ల హీరోయిన్ చరణ్‌తో రొమాన్స్ చేయబోతుందట.
సుకుమార్‌తో ఆర్‌సీ17 కోసం రెడీ అవుతున్న రామ్ చరణ్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవల `పెద్ది`తో విజయాన్ని అందుకున్నారు. `ఆచార్య`, `గేమ్ ఛేంజర్` వంటి డిజాస్టర్ల తర్వాత ఆయనకు `పెద్ది` మూవీ చాలా వరకు రిలీఫ్‌నిచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా కమర్షియల్‌గా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కానప్పటికీ ఆడియెన్స్ ఆదరణ పొందడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో రామ్ చరణ్ నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. `ఆర్‌సీ17` వర్కింగ్ టైటిల్‌తో ఇది స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
24
ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఆర్‌సీ 17
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ `రంగస్థలం` అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఆ సమయంలోనే మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలని భావించారు. `పుష్ప` చిత్రాల తర్వాత ఇప్పుడు సుకుమార్ మళ్లీ రామ్ చరణ్‌తోనే సినిమా చేయబోతున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు సుకుమార్. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారట. అందులో భాగంగా ఇప్పుడు హీరోయిన్‌కి సంబంధించిన అప్ డేట్ షాకిస్తోంది.
34
కియారా అద్వానీ ఫస్ట్ ఛాయిస్
`RC17`లో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోవాలనుకున్నారట. చాలా రోజుల క్రితమే ఆమెని ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపించాయి. రామ్ చరణ్, కియారా కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. `వినయ విధేయ రామ`, `గేమ్ ఛేంజర్` చిత్రాలు రాగా, ఈ రెండూ పరాజయం చెందాయి. ఇంకా చెప్పాలంటే పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో కియారాతో రామ్ చరణ్ మరో సినిమా అంటే అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. కియారా స్థానంలో మరో హీరోయిన్‌ని పరిశీలిస్తున్నారు. ఒక సంచలన హీరోయిన్‌ని తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు రచ్చ చేస్తోంది.
`ఆర్‌సీ17`లో రామ్ చరణ్‌తో రూ.3200కోట్ల హీరోయిన్ రొమాన్స్ చేయబోతుందట. ఆమెనే `ధురంధర్` హీరోయిన్ సారా అర్జున్. ఈ అమ్మడు `ధురంధర్`, `ధురంధర్ 2` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. మొదటి మూవీ సుమారు రూ.1350కోట్లు రాబడితే, `ధురంధర్ 2` ఏకంగా రూ.1850కోట్లు వసూలు చేసింది. ఇండియన్ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ `బాహుబలి 2`ని బీట్ చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యింది, స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది సారా అర్జున్. అదే సమయంలో హాట్ కేక్‌గానూ మారింది. దీంతో ఈ అమ్మడిని రామ్ చరణ్, సుకుమార్ సినిమా కోసం హీరోయిన్‌గా ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ తో ఈ బ్యూటీ రొమాన్స్ చేస్తే ఆడియెన్స్ కి, మెగా అభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. దీన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.