త్రిష రియల్ ఎస్టేట్ ఆస్తులలో చెన్నైలోని ఇల్లు చాలా ప్రత్యేకం. చెన్నైలోని ఆమె ఇంటి విలువ సుమారు ₹10 కోట్లు అని సమాచారం. రస్ట్ ఆరెంజ్, బేజ్, బ్రౌన్, మ్యూటెడ్ గోల్డ్ వంటి ఎర్తీ కలర్స్‌తో ఇంటి ఇంటీరియర్‌ను అందంగా తీర్చిదిద్దారు. పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్, ఇతర అలంకరణ వస్తువులతో ఇంటిని డిజైన్ చేశారు. ఈ ఇంట్లో బట్టలు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లతో నిండిన వాక్-ఇన్ వార్డ్‌రోబ్ కూడా ఉందని సమాచారం. చెన్నైలోనే కాకుండా, హైదరాబాద్‌లోనూ త్రిషకు ఖరీదైన ఇళ్లు ఉందట. దీని విలువ సుమారు ₹6 నుంచి ₹6.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలుగు సినిమా షూటింగ్‌ల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఈ ఇంట్లోనే ఉంటారట. వీటితో పాటు లండన్‌లో కూడా త్రిషకు ఒక లగ్జరీ ప్రాపర్టీ ఉందని వార్తలున్నాయి.