850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం

Published : Dec 22, 2025, 02:12 PM IST

ప్రపంచవ్యాప్తంగా ధురందర్ సినిమా దూసుకుపోతోంది. ఒకప్పుడు రికార్డు సృస్టించిన సినిమాలకు షాక్ ఇస్తూ.. భారీగా వసూళ్ల వరద పారిస్తోంది. ఇంతకీ ఈసినిమా కలెక్షన్లు వివరాలే చూస్తే? 

PREV
15
బాక్సాఫీస్ వద్ద ధురందర్ ప్రభంజనం

రణ్‌వీర్ సింగ్ హీరోగా  నటించిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్ల వరద పారిస్తోంది.  వరల్డ్ వైడ్ గా ఈసినిమా  852.75 కోట్లు వసూలు చేసి, రణ్‌బీర్ కపూర్ యానిమల్ లైఫ్‌టైమ్ కలెక్షన్‌ను అధిగమించింది.

25
నట విశ్వరూపం చూపించిన రణ్ వీర్ సింగ్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్ తన నట విశ్వరూపం చూపించాడు ఉగ్రరూపంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా ఫస్ట్ లుక్ కూడా భారీ అంచనాలను పెంచింది.

35
రణ్‌వీర్ సింగ్‌తో పాటు భారీ తారాగణం

ధురందర్ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో నటించి సినిమా స్థాయిని పెంచారు.

45
ట్రెండింగ్‌లో ధురందర్ టైటిల్ ట్రాక్

శాశ్వత్ సచ్‌దేవ్, చరణ్‌జిత్ అహూజా స్వరపరిచిన ఈసినిమా పాటలు ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే గూజ్ బాంమ్స్ తెప్పిస్తోంది. ధురందర్ టైటిల్ ట్రాక్ ఆధునిక హిప్-హాప్, పంజాబీ శైలుల కలయికతో అద్బుతంగా ఉంది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

55
దర్శకుడు ఆదిత్య ధర్ అద్భుతం..

గతంలో 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' చిత్రంతో సంచలనం సృష్టించాడు దర్శకుడు ఆదిత్య. ఆసినిమా తరువాత గ్యాప్ ఇచ్చి.. 'ధురందర్' సినిమాను తెరకెక్కించాడు. ఈసినిమాకు రచన, దర్శకత్వం వహించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories