Demon Pavan Remuneration : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పైనల్స్ లో చాలా తెలివిగా ఆలోచించాడు డీమాన్ పవన్. 15 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. పవన్ 15 వారాలు బిగ్ బాస్ లో ఉన్నందుకు అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
డిమాన్ పవన్ అనుకోకుండా.. అనూహ్యంగా టాప్ 3 లోకి వచ్చాడు. రీతూ వల్ల ఎప్పుడో ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే.. అందరికి షాక్ ఇస్తూ.. ఫైనల్ వీక్ లో అందరిని ఇంప్రెస్ చేశాడు. అగ్నిపరీక్ష టాస్క్‌లో పెద్దగా ఎంటర్టైన్ చేయకపోయినా.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన పవన్.. ఆతరువాత రీతు హడావిడిలో పడి తన గేమ్ నే మర్చిపోయాడు. రీతూ చుట్టు తిరుగుతూ.. కావల్సినంత స్టఫ్ మాత్రం ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో పవన్ ఆటతీరు కూడా అందరి దృష్టిని ఆకర్శించింది. ఒక్కోసారి తన ఆట, తన మాట తీరుతో అందరి అభిప్రాయాలను పూర్తిగా మార్చేశారు. కండబలంతో పాటు బుద్ధిబలం ఉపయోగించి ఆడుతూ, తాను సాధారణ కంటెస్టెంట్ కాదని నిరూపించారు. వరుసగా రెండుసార్లు కెప్టెన్‌గా నిలిచాడు. రీతూతో ఉన్న లవ్ ట్రాక్ కారణంగా పవన్‌పై చాలా నెగెటివిటీ వచ్చింది. రీతూ లేకుంటే మొదటి నుంచి డీమాన్ పవన్ టాప్ లో ఉంటూ.. ఫైనల్స్ లోకి అవలీలగా వచ్చేవాడు.
24
ఫైనల్ వీక్ లో సత్తా చాటిన డిమాన్ పవన్
రీతూతో ఉన్న లవ్ ట్రాక్ కారణంగా పవన్‌పై చాలా నెగెటివిటీ వచ్చింది. రీతూ లేకుంటే మొదటి నుంచి డీమాన్ పవన్ టాప్ లో ఉంటూ.. ఫైనల్స్ లోకి అవలీలగా వచ్చేవాడు. రీతూ ఎలిమినేట్ అయిన తరువాత డిమాన్ పవన్ లో అసలు ఆటగాడు బయటు వచ్చాడు. ఫైనల్ వీక్ లో పవన్ పూర్తిగా మారిపోయాడు. తన ఆటతీరుతో మెస్మరైజ్ చేశాడు. టాప్5 లో స్థానం సంపాదించుకున్నాడు. అంతే కాదు ఫైనల్ వీక్ లో పవన్ ఆటతీరుతో..అన్ని వారాలు ఎంటర్టైన్ చేసిన ఇమ్మాన్యుయేల్ కూడా సైడ్ అయిపోవాల్సి వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా టైటిల్ రేసులో కళ్యాణ్, తనూజలకు గట్టి పోటీ ఇచ్చాడు. చివరకు టాప్ 3గా నిలిచాడు డీమాన్ పవన్.
34
తెలివిగా ఆలోచించిన డీమాన్ పవన్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలేలో టాప్ 3 గా నిలిచిన డీమాన్ పవన్ కు గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. 15 లక్షలు తీసుకుని బయటు వెళ్లే అవకాశం ఇచ్చాడు. సరిగ్గా అప్పుడే తెలివిగా ఆలోచించాడు డిమాన్ పవన్. తనకు విన్నర్ అయ్యే అవకాశం లేదు అని తెలిసినట్టు వెల్లడించాడు. ప్రస్తుతం డబ్బుతో చాలా అవసరం ఉంది. అందుకే 15 లక్షలు తీసుకునివెళ్లిపోతున్నా అని అన్నాడు. ఈ విషయంలో డిమాన్ పవన్ తన కుటుంబ సభ్యుల అభిప్రాయం కూడా తెలుసుకున్నాడు. వాళ్ళు నీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పారు. చివరికి ఫైనల్ ఆఫర్ 15 లక్షలు తీసుకువచ్చిన ఆడియన్స్ కి థ్యాంక్స్. కానీ డబ్బు అవసరం చాలా ఉంది. అందుకే ఈ 15 లక్షల ఆఫర్ తీసుకుంటున్నా అని తెలిపాడు. పవన్ ఎంత అదృష్టవంతుడో ఆ తర్వాతే తెలిసింది. ఒక వేళ పవన్ ఈ ఆఫర్ తీసుకోకపోయినా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యేది అతడే. అలా జరిగి ఉంటే పవన్ ఖాళీ చేతులతో వెళ్లాల్సి వచ్చేది.
ఇదిలా ఉంటే.. 15 లక్షల ప్రైజ్ మనీతో పాటుగా.. డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు రెమ్యునరేషన్ కూడా వచ్చింది. సమాచారం ప్రకారం పవన్‌కు వారానికి సుమారు 70,000 వరకూ చెల్లించినట్టు తెలుస్తోంది. 15 వారాలకు గాను ఆయన సుమారు 10 లక్షల 50 వేల వరకు సంపాదించినట్టు అంచనా. ఆ పదిలక్షలకు తోడు మరో 15 లక్షలు కలిపి.. దాదాపు 25 లక్షలకు పైనే డిమాన్ పవన్ గెలుచుకున్నాడు. అంటే ఒక సెలబ్రిటీ బిగ్ బాస్ సంపాదన కంటే ఎక్కువగానే అతను జేబులో వేసుకుని వచ్చేశాడు.