Dhurandhar 2 OTT Release: అభిమానులకు షాక్.. ధూరందర్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Published : Apr 09, 2026, 02:37 PM IST

బాక్సాఫీస్ వద్ద ధూరందర్ 2: ది రివెంజ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ కారణంగా సినిమా ఓటీటీ ఎంట్రీ ఆలస్యం కానుంది. భారీ వసూళ్లు, ఐపీఎల్ సీజన్ వంటి కారణాలతో రణ్‌వీర్ సింగ్ సినిమా స్ట్రీమింగ్  లేట్ కాబోతోంది. ఇంతకీ ధురంధర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? 

PREV
13
ధూరందర్ 2 ఓటీటీ రిలీజ్ ప్లాన్..

రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధూరందర్ 2: ది రివెంజ్' మార్చి 19న విడుదలై థియేటర్లలో అద్భుతంగా ఆడుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1,600 కోట్లకు పైగా వసూలు చేసిందని, వారాలు గడుస్తున్నా ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉందని సమాచారం. ఈ భారీ విజయం కారణంగా, మేకర్స్ సినిమాను ఓటీటీకి తీసుకురావడానికి తొందరపడటం లేదు. సాధారణంగా పెద్ద బడ్జెట్ బాలీవుడ్ సినిమాలు, థియేటర్లలో  ఆదాయం కోసం ఎనిమిది వారాల విండో తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వస్తాయి.

23
ధురంధర్ 2 హక్కులు ఎవరిావి?

ఈ సినిమా డిజిటల్ హక్కులు జియోహాట్‌స్టార్ వద్ద ఉన్నాయి. వాళ్లు సరైన టైమింగ్ కోసం చూస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సమయంలో రిలీజ్ చేస్తే పోటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే టోర్నమెంట్ ముగిసిన తర్వాతే సినిమాను ప్రీమియర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, మే 2026 చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో సినిమా రిలీజ్ కావొచ్చు. ఈ ఆలస్యం వల్ల సినిమాకు ఐపీఎల్ పోటీ లేకుండా ఎక్కవ వ్యూయర్‌షిప్ లభిస్తుంది.

33
ధురంధర్ 2 డిజిటల్ హక్కులు ఎన్ని కోట్లు..?

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్‌లో గూఢచర్యం, హై-రిస్క్ మిషన్ల చుట్టూ కథ సాగుతుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ అండర్‌కవర్ ఏజెంట్ జస్‌కిరత్ సింగ్ రంగీ పాత్రలో మళ్లీ కనిపించనున్నారు. సంక్లిష్టమైన క్రాస్-బార్డర్ ఆపరేషన్లలో ఆయన పాల్గొంటారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిజిటల్ హక్కులు ₹120-150 కోట్లకు అమ్ముడయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఇది సినిమాపై ఉన్న భారీ అంచనాలను, ప్రేక్షకుల డిమాండ్‌ను చూపిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories